)
Powerful Sun Transit Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సంచారం చేసే గ్రహాల్లో సూర్య గ్రహణం ఒకటి.. ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా చాలా శక్తివంతమైన గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం సెప్టెంబర్ 27వ తేదీన హస్తా నక్షత్రం లోకి ప్రవేశించింది. ఈ నక్షత్ర సంచార ప్రభావం మొత్తం 30 రోజుల పాటు అన్ని రాశుల వారిపై కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వ్యక్తిగత జీవితాల్లో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాతకంలో సూర్యుడు శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి దేనికి లోటు ఉండదు. ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా ఎంతో సులభంగా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి
సెప్టెంబర్ 27వ తేదీన సూర్యుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించినందున వృషభ రాశి వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చాలావరకు వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. దీంతోపాటు అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకొని విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో వృషభరాశి వారు తప్పకుండా కొన్ని శుభవార్తలు కూడా వింటారు. జీవితంలో అన్ని రంగాల్లో పనులు చేసే వ్యక్తులు ఈ సమయంలో సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారు.
కన్యా రాశి
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుని నక్షత్ర సంచార మార్పుల కారణంగా బోలేడు ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కెరీర్ పరంగా చాలా వరకు పురోగతి లభిస్తుంది. అలాగే అనేక రకాల పనుల్లో మెరుగుదల కనిపించి.. అద్భుతమైన లాభాలు పొందుతారు. దీంతోపాటు నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి పొందే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటినుంచో పొందాలనుకుంటున్న డబ్బు కూడా ఈ సమయంలో భారీ మొత్తంలో పొందగలుగుతారు. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా హస్తా నక్షత్రంలోకి సూర్యుడి ప్రవేశించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి అనుకూలమైన పరిస్థితులు నెలకొని విశేషమైన లాభాలు పొందే అదృష్టాన్ని కూడా సొంతం చేసుకుంటారు. అలాగే ఏమైనా కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరికి సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా ఊహించని స్థాయిలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా కొత్త పనులు ఏమి ప్రారంభించిన అద్భుతమైన లాభాలు పొందుతారు. దీంతోపాటు ఎంతో ఉత్సాహంతో జీవితాన్ని ముందుకు నడిపిస్తారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook