)
Purattasi Masam:ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజల కొంగు బంగారంగా శ్రీ వేంకటేశ్వర స్వామికి కొలుస్తారు. పెరటాసి మాసంలోనే నాలుగు శనివారాల తమిళ ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు ,కేరళతో సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ మాసాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాల్లో వేంకటేశ్వర స్వామిని విశేషగా పూజిస్తారు. ఇది సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే తమిళ నెల పురటాసిలో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ వస్తోంది. ఈ మాసంలో వేంకటేశ్వరుడు భూమిపై ఆవిర్భవించాడని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలోని అన్ని శనివారాలను పవిత్రమైన రోజులుగా భావించి భక్తులు విశేషంగా పూజిస్తారు. ఈ కాలంలో విష్ణు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బేసి శనివారాలు 1, 3, 5 తేదీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఈ నెలలో తిరుమల వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో తిరుమల లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు.
పెరటాసి మాసంలో వేంకటేశ్వరుడు భూమిపై తన దివ్య సన్నిధిని నెలకొల్పారు. పురటాసి మాసంలోనే తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు. పురటాసి మాసంలో శనిదేవుడు తన శక్తిని కోల్పోతాడట. అందువల్ల ఎలాంటి ఇబ్బంది సృష్టించలేడని కూడా పురాణ కథనం.నారదుడు వైకుంఠానికి వెళ్లిన తర్వాత వెంటకేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకోవాలనుకున్నాడు.
పెరటాసి మాసంలోని శనివారాలలో ఉపవాసం ఉండి తనను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీనివాసుడు నారదునితో చెప్పాడు. పెరటాసి మాసంలో శనైశ్చరుడు వల్ల కలిగే కష్టాలను కూడా తొలగిస్తాడనేది శాస్త్రాలు చెబుతున్న మాట. శని దేవుడు చెడు ప్రభావాల నుండి శనివారాలు విముక్తి పొందుటకు ఆ రోజున శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడం సులభమని భక్తుల విశ్వాసం.
పెరటాసి మాసంలో శనైశ్చరుడు తన శక్తిని కోల్పోతాడట. అందువల్ల అతను వెంకటేశ్వర స్వామిని పూజించిన వారి జోలికి పొడట.ఈ మాసంలో వేంకటేశ్వరుని అనుగ్రహం పొందడం సులభం.పెరటాసి మాసంలో ప్రతి శనివారం విష్ణు భక్తులు తిరుపతిని దర్శించి తరిస్తారు. ప్రయాణం చేయలేని వారు బియ్యపు పిండి దీపం పూజించడం ద్వారా ఆయన భక్తులను కరుణిస్తాడట. అందుకే శనివారాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నారు.
ప్రసిద్ధ పెరటాసి పూజ : దీని విశిష్ఠత..
తిరుమల శ్రీనివాస పరబ్రహ్మను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ దక్షిణ భారతదేశంలో చేసే నాలుగు శనివారాలు పూజా విధానంలో ఉంది. ఈ మాసంలో ప్రజలు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసిన తర్వాత వారు తమ ఇళ్లను శుభ్రం చేసిన తర్వాత కానీ పూజ చేయరు. నిత్య పూజలో భాగంగా ఈ నెల రోజులు ప్రతిరోజు సుప్రభాతం పాటిస్తారు. వేంకటేశ్వర స్వామిని మల్లె, మందారం, లిల్లీ, తామర, మర్రిచెట్టు ఆకులు, ముఖ్యంగా తులసి మాలా, మామిడి ఆకులతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుందట.
అలాగే అరటి, పైన్ ఆపిల్, ఆపిల్, ద్రాక్ష, బొప్పాయి, నారింజ తో పాటు బత్తాయి, వేరుశెనగలు మొదలైన పళ్ళతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందట. వంటలలో వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన తీపి బెల్లం పొంగలి, మిర్యాల పొంగలిని సమర్పిస్తారు. పంచామృతం, వడ, పాయసం, పులిహోర, దద్దోజనం , దోసె, నువ్వుల పిండి, బియ్యం పిండి, ముద్ద పప్పు, సాంబారు, రసం, పెరుగు, నెయ్యి ,అన్నం మొదలైన వంటలతో నైవేద్యం సమర్పించి పూజ చేస్తే అత్యుత్తమ ఫలితాలుంటాయి.
పూజ సమయంలో మొదట దీపం వెలిగించి, వరుసగా నైవేధ్యం, అగర్బత్తి, సాంబ్రాణి, కొబ్బరికాయ, హారతి సమర్పించాలి. మూడు అరటి ఆకులపై శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శ్రీదేవి , భూదేవికి వాళ్ళకి నైవేధ్యం సమర్పించాలి. ఇంట్లో అందరూ తిరునామం పెట్టుకోవాలి కొంతమంది పురటాసిలో అన్ని రోజులలో పాక్షిక ఉపవాసాన్ని పాటిస్తారు.
మరికొందరు దీనిని పురటాసి శనివారాల వ్రతంగా చేస్తారు. కొంతమంది శనివారాల్లో చుక్క నీరు కూడా తాగకుండా ఉండే కఠినమైన ఉపవాసాన్ని నిర్జల వ్రతం అంటారు.కొంతమంది భక్తులు ఈ నెల మొత్తం శాఖాహారం మాత్రమే తింటారు. వ్యసనాలు దూరంగా ఉంటారు. ఒక నెల పాటు ధూమపానం మద్యం సేవించడం మానేశారు.పురటాసి శనివారాలలో, విష్ణువు యొక్క రెండు పాదాల చిహ్నమైన తిరునామము,నుదుటిపై మగవారు ధరిస్తే, స్త్రీలు కాషాయ చొక్కాను ఎంచుకుంటారు.పురటాసి మాసం మహత్యం తెలుసుకొని పైన చెప్పిన పూజా విధానంలో ఆ శ్రీనివాసుని నాలుగు శనివారాలు భక్తితో పూజించి ఆ శ్రీనివాస పరబ్రహ్మ కృపా కటాక్షాలు పొందగలరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.