Rahu Most Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువు గ్రహాలను మాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహం ఎంతో అరుదుగా ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాయి. దుష్ట గ్రహాలుగా పిలిచే ఈ రెండు గ్రహాలు సంచారం చేసినప్పుడు మొత్తం అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా ఈ గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారికి ఎన్నో రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే రాహువు, కేతువు గ్రహానికి ఎప్పుడు కొన్ని రాశులంటే చాలా ఇష్టమని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రాశులవారికి ఎల్లప్పుడు బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని సానుకూల ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రాహువు అనుగ్రహం వల్ల అదృష్టం పొందే రాశులవారు ఎవరో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వృశ్చిక రాశి
రాహువుకి అత్యంత ఇష్టమైన రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి.. ఈ రాశివారు ఎల్లప్పుడు రాహువు అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో జన్మించిన వారు అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో కూడా విశేష ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా తెరుచుకుంటాయి. అలాగే డబ్బుకు కొరత ఉండదు.. వీరు ఎల్లప్పుడు అకస్మిక ధన లాభాలు పొందే అదృష్టాన్ని కలిగి ఉంటుంది. అలాగే జీవితంలో వస్తున్న అన్ని రకాల అడ్డంకులు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపులున్నారు.
సింహ రాశి
రాహువుకు ఎంతో ప్రీతికరమైన రాశుల్లో సింహ రాశి కూడా ఒకటి.. ఈ రాశివారు ఎల్లప్పుడు శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సింహ రాశివారు ఎప్పుడు ధైర్యవంతంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వీరికి ఆకస్మికంగా కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి. సింహ రాశివారికి అనుకున్న పనులు వెంట వెంటనే చేయగలుగుతారు. అంతేకాకుండా వీరు అన్ని రకాల ఆనందాన్ని పొందే అదృష్టాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి జీవితంలో అనుకున్న సుఖాన్ని కూడా పొందుతారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. రాహువు అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
రాహువు స్వభావం:
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గురించి ఎంతో క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ గ్రహం చేత ప్రభావితమైన రాశులవారికి ఆకస్మిక సంఘటలు ఎదురవుతాయి. అంతేకాకుండా దీని వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో రాహువు అనుగ్రహం వల్ల జీవితంలో ఊహించని డబ్బు కూడా లభిస్తుంది. అంతేకాకుండా పూర్తిగా వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే ప్రేమ జీవితంలో కూడా అనేక ఆటంకాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తే చాన్స్‌లు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








