)
Rahu Rajayogam 2025:రాహువు, కేతువు నవగ్రహాల్లో ఛాయగ్రహాలు. ఇవి ఎల్లపుడు ఒకదానికొకటి 180 డిగ్రీల్లో సంచారం చేస్తుంటాయి. ఎల్లప్పుడూ తిరోగమనంలో కదులుతుంటాయి. జ్యోతిష్యం శాస్త్ర లెక్కల ప్రకారం.. ఈ యేడాది నవంబర్‌లో రాహువు తానుండే నక్షత్రం నుంచి వేరే నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. నవంబర్ 23, 2025న, రాహువు పూర్వాభాద్ర నక్షత్రాన్ని వదిలి శతభిషనక్షత్రంలోకి వెళ్లనున్నాడు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి రాహువు యొక్క ఈ సంచారము చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించాలి.
కుంభ రాశి: రాహువు శతభిష నక్షతంలో అడుగుపెట్టడం వలన ఈ రాశుల వారికి పాత సమస్యలు తొలిగిపోతాయి. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న ఇబ్బందులు పరిష్కరించబడతాయి. వైవాహిక జీవితం కొత్తగా ఉంటుంది. చేసే పనిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలం దక్కుతుంది.
మిథున రాశి: రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశుల వారికి సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వీరి జీవనశైలిలో సానుకూల మార్పు ఉండబోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆకస్మిక పురోగతి ఉంటుంది.
కర్కాటక రాశి: ఆర్థిక రంగంలో లాభాలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి నుండి కూడా లాభాలు అందుకుంటారు. ఆఫీసులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రతిపనిలో మీదే విజయం వరిస్తుంది.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, హిందూ పంచాంగాలు, ఇతరత్రా సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ సమాచారం సరైనదే కానీ.. అది నమ్మడం నమ్మకపోవడం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ZEE NEWS దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.