Ramadan Importance: పవిత్రమైన రంజాన్ నెల ఆరంభమైంది. సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ఉపవాసాలు ప్రారంభం కాగా, ఇండియాలో రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం ఇవాళ్టితో షాబాన్ నెల పూర్తి కానుంది. రంజాన్ విశిష్టత, ఉపవాసాలు ఎలా ఉంటారనే వివరాలు మీ కోసం
ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సందడి మొదలైంది. షాబాన్ నెల పూర్తి కావడంతో ఇవాళ్టి నుంచి సౌదీ అరేబియా ఇతర ప్రాంతాల్లో ఉపవాసాలు ఆరంభం కాగా రేపటి నుంచి ఇండియాలో ఉపవాస దీక్షలు మొదలు కానున్నాయి. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ తరువాత షవ్వాల్, ఆ తరువాత జిల్ ఖాయిదా నెలలు ఉంటాయి. వాస్తవానికి ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ కూడ ఓ నెల మాత్రమే. మరి ఇతర నెలలకు లేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ నెలకే ఎందుకంటే రంజాన్ నెలలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించింది. మానవాళికి సందేశాన్నిచ్చే దివ్య ఖురాన్ దైవగ్రంధంగా ఈ నెలలోనే వచ్చింది. అందుకే రంజాన్ నెలకు అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్నాయి. ఈ సందర్భంగా రంజాన్ నెలంతా విధిగా ఉపవాసాలు ఉండాలి. ఇది ఇస్లాం మత నిబంధన. ఇది సాంప్రదాయం కానే కాదు. ప్రతి ముస్లిం తప్పకుండా ఆచరించాల్సిన విధి.
రంజాన్ నెలలో రోజంతా కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయం సూర్యాస్తమయం కంటే ముందు ప్రారంభమై సాయంత్రం సూర్యాస్తమయంతో పూర్తవుతుంది. అంటే రోజుకు 13-14 గంటల ఉపవాసంలో మంచి నీళ్లు కూడా తాగరు. కోరికల్ని అదుపులో ఉంచుకుంటారు. చెడు సావాసాలకు దూరంగా ఉంటారు. ఇలా నెల రోజులు అలవాటు చేసుకుని మిగిలిన 11 నెలలు అదే పాటించేందుకు ప్రయత్నిస్తారు. ఇదే రంజాన్ ఉపవాసాల అంతర్లీన ఉద్దేశ్యం. క్రీస్తుశకం 610 ప్రాంతంలో ఖురాన్ అవతరించినట్టు తెలుస్తోంది. మొత్తం గ్రంధం ఒకేసారి అవతరించలేదు. ఆయత్ లేదా వాక్యాల రూపంలో 23 ఏళ్ల పాటు అవతరించిన గ్రంధమిది.
రంజాన్ నెలలో సహరి, ఇఫ్తార్ రెండు ముఖ్యమైన ప్రక్రియలు. సహరి అంటే ఉపవాసం ప్రారంభించేది కాగా ఇఫ్తార్ అంటే సాయంత్రం ఉపవాసదీక్ష ముగించేది. దేశంలో వివిధ నగరాల్లో సహరి, ఇఫ్తార్ టైమింగ్స్ మారుతుంటాయి. ఆయా నగరాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్ని బట్టి ఉంటుంది. ఉదయం సహరి అంటే సూర్యాస్తమయానికి ముందు అంటే 5 గంటల ప్రాంతంలో ఉపవాసం ప్రారంభమౌతుంది. తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ తో ముగించాలి.
Also read: AP Inter Exams: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









