Saptagrahi Yogam Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో తప్పకుండా ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రతి గ్రహం స్థాన సంచారం చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మార్చి నెల గ్రహసంచారాలపరంగా చాలా ప్రత్యేకత కలిగి ఉంటుంది ఎందుకంటే మార్చి 29న మీనరాశిలో కొన్ని గ్రహాల కలయిక జరగబోతోంది. దాదాపు వందేళ్ల తర్వాత మీన రాశిలో ఏడు గ్రహాల కలయిక జరుగుతుంది. మార్చి 29 న మీనరాశిలో శని, చంద్ర, కుజ, శుక్ర, సూర్య, బుధ గ్రహాలతో పాటు రాహు గ్రహం కూడా కలయిక జరుగుతుంది. దీని కారణంగా చాలా ఏళ్ల తర్వాత సప్తగ్రహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటే మరి కొన్ని రాశుల వారికి అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కర్కాటక రాశి:
సప్తగ్రహి యోగం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎప్పుడు లేని లాభాలు కలుగుతాయి. వీరికి పెండింగ్లో ఉన్న పనులు మొత్తం పూర్తవుతాయి. అలాగే కొత్త అవకాశాలు రావడమే కాకుండా వ్యాపారాలవేత్తలతో సంబంధాలు మెరుగుపడి కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీంతో పాటు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఇంట్లో మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగి వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాగే వీరి లోపల సానుకూల శక్తి పెరిగి ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. దీని వల్ల పదోన్నతులు లభించి.. ప్రశంసలు కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
మిథున రాశి:
సప్తగ్రహి యోగం ఎఫెక్ట్ (Saptagrahi Yogam Effect) మిథున రాశి వారిపై కూడా పడుతుంది. వీరికి జీవితంలో ఊహించని లాభాలతో పాటు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ యోగం వల్ల ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా కార్యాలయాల్లో ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సమయంలో జీతం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కొత్త ఉత్సాహంతో పాటు సానుకూల మార్పులు వస్తాయని.. జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభించాయి. మున్ముందు మరికొందరికి పెద్ద కంపెనీల నుంచి మంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి.
కన్యారాశి:
కన్యా రాశి వారికి కూడా వృత్తిపరమైన జీవితంలో ఊహించని విజయాలు లభిస్తాయి. దీంతో పాటు వైవాహిక జీవితంలో ఆనందం వృత్తిపరమైన జీవితంలో విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అలాగే వైవాహిక జీవితం పై సానుకూల ప్రభావం పడి అనేక విషయాల్లో శుభవార్తలు వింటారు. అలాగే ప్రేమ జీవితం కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టుల లభించి అనుకున్నది అనుకున్నట్లుగా రాణించగలిగి ఊహించని లాభాలు పొందగలుగుతారు. శారీరకంగా కూడా కన్యా రాశి వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. జీవితంలో సానుకూల మార్పులతో ఈ సమయం నుంచి ముందుకు వెళ్తారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









