)
Saturn And Mercury Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ శని గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలు అప్పుడప్పుడు రాశులతోపాటు నక్షత్రాలు కూడా మారుతూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా శని గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏప్రిల్ 3న బుధుడు గృహస్పతి నక్షత్రం పూర్వభద్రపదంలోకి సంచారం చేశాడు. ఇప్పటికే ఈ నక్షత్రంలో శని గ్రహం కూడా ఉంది.
పూర్వ భాద్రపాదనక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల శనితో కలయిక జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని బుధ గ్రహాలు దాదాపు 30 ఏళ్ల తర్వాత నక్షత్రంలో కలయిక జరిపాయి. దీనివల్ల కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు.
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు పూర్వ భాద్రపాద నక్షత్రంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. దీంతో పాటు చట్టపరమైన సమస్యల నుంచి కూడా పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ యువతకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కలుగుతాయని జ్యోతిష్యుడు చెబుతున్నారు. ముఖ్యంగా మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ధైర్యం పెరగడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. ఎప్పటినుంచో కుటుంబ పరంగా వస్తున్న సమస్యలతో బాధపడుతున్న వారికి అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించబోతోంది.
వృషభ రాశి
బుధుడు శని గ్రహాల ప్రభావం వల్ల ఉద్యోగరీత్యా వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. వీరికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు. ఇక బంధువుల నుంచి కూడా ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి శని ప్రత్యేకమైన ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ వెంట వెంటనే జరుగుతాయి. వృషభ రాశి లో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో కొత్త ఇళ్ళతో పాటు కార్లు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే తల్లిదండ్రుల సపోర్టు లభించి అన్ని పనుల్లో ముందుకెళ్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వృషభ రాశి వారు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేసే సీనియర్ల నుంచి మంచి సపోర్టు లభించి వీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
తులారాశి
తులా రాశి వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా బుధ గ్రహ ప్రభావంతో ఈ రాశుల వారికి మానసిక ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే దూర ప్రయాణాలు చేసే క్రమంలో మాత్రం వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.. దీంతోపాటు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం ఎంతో మంచిది. తులా రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లభించి మానసిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఈ సమయంలో ముందుకు సాగుతారు. ఇక నిరుద్యోగులకు ఈ సమయం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు కూడా నెరవేరే ఛాన్సులు ఉన్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook