Saturn Retrograde Effect On Zodiac: శని గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాల కంటే శక్తివంతమైందిగా భావిస్తారు. అంతేకాకుండా చెడు గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రత్యేకత కలిగిన గ్రహం జూలై 13 వ తేదీన ఆదివారం 9 గంటలకు తిరోగమనం చేయబోతోంది. శని గ్రహం దాదాపు 138 రోజుల తర్వాత వక్రగతిలో కదులబోతున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై విపరీతంగా పడుతుంది. ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతున్న కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఈ తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని తిరోగమనం కారణంగా ఏ ఏ రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో? అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మిధున రాశి
మిధున రాశి వారికి శని గ్రహం తీరోగమనం కారణంగా చాలా శుభ్రంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మిధున రాశి వారికి దాదాపు 130 రోజుల పాటు చాలా శుభ్రంగా ఉంటుంది. కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఊహించని పురోగతి కూడా లభిస్తుంది. వ్యాపారాలు చేస్తున్నవారు వాటిని విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చాలావరకు ఆర్థికపరమైన లాభాలు కూడా కలుగుతాయి. ఇక చిన్న చిన్న సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఎంతో ఆనందంగా ఉంటారు..
కర్కాటక రాశి
శని వక్రమార్గం కర్కాటక రాశి వారికి అదృష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలపై కూడా ఈ సమయంలో చాలా వరకు ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అదృష్టం సహకరించి అనుకున్న పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో శని అనుగ్రహం లభించి.. సమాజంలో మంచి పనులు చేస్తారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరికి ఈ సమయంలో వాక్చాతుర్యం పెరిగి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవం కూల పెరుగుతుంది. పనులన్నీ అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు. అలాగే ఆర్థికపరంగా కూడా కుంభ రాశి వారికి గతం కంటే ఇప్పుడు మరింత బాగుంటుంది. శని అనుగ్రహంతో కుంభ రాశి వారు శుభవార్తలు కూడా వింటారు. కుంభ రాశి వారి ఈ సమయంలో ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందుతారు.. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









