Saturn Transit 2025: మీన రాశిలోకి ప్రస్తుతం వక్ర సంచారం చేస్తున్న శనిదేవునికి నవంబరు 10 తేదీ తర్వాత నుంచి మరింత బలం పెరుగుతోంది. ఈ రాశిలో గురువు అధిపతిగా ఉండగా.. గురువుకు చెందిన పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న ఉచ్ఛస్థితిలో గురువు వీక్షించడం వల్ల కొన్ని రాశులకు శుభకాలంగా మారింది.
ఇప్పుడు గురువు ఆధీనంలో ఉన్న శనీశ్వరుడు.. మేష, వృషభ, కర్కాటక, కన్య, తులా, మకర రాశులకు విదేశీయానం అనుకూలంగా మారుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో సంపాదన వంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఈ రాశులకు బాగా అనుకూలంగా ఉండబోతుంది.
మేషం రాశి వారికి అతిత్వరలోనే విదేశీయానం ఉండే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన వ్యయ స్థానంలో ఉన్న శని.. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాల్లో అవకాశం రావొచ్చు. అయితే ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఉద్యోగులకు స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఈ రాశికి ఉంది.
వృషభ రాశిలో దశమ స్థానాధిపతి శని.. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న కారణంగా వీరికి విదేశీయానం అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగం, పరిశోధనలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు, ఉన్నత విద్యలు వగైరాల కారణంగా ఈ రాశి వారు త్వరలోనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడే స్థిరపడే అవకాశం కూడా ఉంది.
కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టిన గురువు స్థానంలో శనీశ్వరుడిని పూర్ణ దృష్టితో ఉన్నందువల్ల ఈ రాశి వారికి విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం ఉంది. ప్రయత్నంతోనే విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
కన్య రాశికి సప్తమ స్థానంలో శని సంచారం చేస్తుండగా.. గురువు సంచారం వల్ల విదేశీయానం తప్పనిసరిగా ఉంటుంది. విదేశాల నుంచి ఆఫర్లు.. విదేశాలను నుంచి ఆహ్వానాలు ఉండే అవకాశం ఉంది. వీరికి విదేశాల్లో స్థిరపడే అవకాశం.. ప్రేమలో పడడం వంటివి జరిగే అవకాశం ఉంది.
తులా రాశికి ఆరవ స్థానంలో శని సంచారం కారణంగా దశమ స్థానం నుంచి ఉచ్ఛ స్థానం విదేశీ సంబంధాల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రాశి వారికి విదేశాల్లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల అవసరాల కోసం అనేక సార్లు ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది.
మకర రాశికి శని తృతీయ స్థానంలో ఉండగా.. గురువు సప్తమ స్థానంలో వీక్షించడం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కోరిక నేరవేరుతుంది. అనేక దేశాలకు వెళ్లడమే కాకుండా.. ఉద్యోగులకు స్థిరత్వం లభించడంతో పాటు సిరిసంపదలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









