Snake Astrology: పాములు అనేవి జీవరాశుల్లో ఒకటి. సరీసృపాల్లో ఒకటైన పాముకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పాములను మతపరమైన, సాంస్కృతికంగాను ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే పామును చూసి దండ పెట్టేవాళ్లే అదే పామును కర్రతో కొట్టి చంపుతారు. పామును సందర్భాలను బట్టి దేవుడిగా కొలుస్తారు. మరికొన్నిసార్లు అదో విషసర్పంగా గుర్తించి చంపుతుంటారు. అవన్నీ పక్కన కొన్ని సంప్రదాయాల ప్రకారం ఉదయం పామును చూడటం శుభమా లేదా అశుభమా అనేది చర్చ జరుగుతోంది. మరి వాస్తవమేమిటో తెలుసుకుందాం.
Also Read: Congress A To Z Scams: కాంగ్రెస్ పార్టీ స్కాముల చిట్టా.. ఏ నుంచి జెడ్ వరకు కుంభకోణాల లిస్ట్ ఇదే!
భారతీయ సంస్కృతిలో మత, సాంస్కృతిక, జానపద నమ్మకాలలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం పామును చూడటం శుభమా లేదా అశుభమా అనేది ప్రజల నమ్మకాలు, సందర్భం, ఆయా ప్రాంతాల సంప్రదాయాలకు అనుగుణంగా మారుతుంది. కొంతమంది ఉదయం పామును చూస్తే అదృష్టం వస్తుందని నమ్ముతారు. ఇది దేవుడి ఆశీర్వాదంగా కూడా భావిస్తుంటారు. గ్రామాల్లో పంటలను కాపాడే పాములను శుభప్రదంగా భావిస్తారు. హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు. సర్పాలను దేవతలుగా పూజిస్తారు. శివుడి మెడలోని పాము, విష్ణువు శేషనాగ అనే సర్పంపై విశ్రాంతి తీసుకోవడం.. నాగుల చవితి, నాగులపంచమి వంటి పండుగలు పాములకు సంబంధించినవి.
Also Read: AP Rains: ఆంధ్రప్రదేశ్‌కు అలర్ట్! రేపు, ఎల్లుండి దక్షిణ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు
శుభ సంకేతం: కొన్ని సంప్రదాయ పద్ధతుల్లో ఉదయం పామును చూడటం శుభసూచకంగా పరిగణిస్తారు. పాము ఉదయం కనిపిస్తే దేవతల నుంచి దీవెనలుగా భావిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పామును వ్యవసాయానికి సంబంధించిన దేవతకు చిహ్నంగా చూస్తారు. ఎందుకంటే పాములు పంటలకు హాని కలిగించే ఎలుకలు, ఇతర హానికరమైన జీవులను తినేస్తాయి.
అశుభ భావన
కొంతమంది ఉదయం పామును చూడటం ఒక హెచ్చరికగా భావిస్తారు. విపత్కర పరిస్థితి ఎదురవుతుంది.. ఆరోజు ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వసిస్తారు. కొన్ని సందర్భాల్లో పాము వెళ్లిన దారిని దాటితే లేదా అకస్మాత్తుగా కనిపిస్తే ఆ రోజు పనిలో సమస్యలు తలెత్తవచ్చని నమ్ముతారు.
నమ్మకాలు లేకపోతే..
శాస్త్రీయంగా పామును చూడటం శుభమా లేదా అశుభమా అనే దానికి ఎటువంటి ఆధారం లేదు. పాములు సాధారణ జీవులు. వాటి పని అవి చేసుకుంటాయి. పర్యావరణం, రుతువు, ఆహారంతో సంబంధం కలిగి పాములు జీవిస్తుంటాయి. ఈ నమ్మకాలు ఏమి పట్టించుకోకుండా సాధారణంగా ఉంటే మంచిది. ఉదయం పామును చూసినట్లయితే ప్రశాంతంగా ఉండండి. కొంతమంది తమ మనస్సులో నాగదేవతను ప్రార్థిస్తారు. లేదా సమీపంలోని ఆలయంలో పూజలు చేస్తారు. ఉదయం పామును చూడటం శుభమా లేక అశుభమా అనేది వ్యక్తిగత నమ్మకాలు, సాంస్కృతిక సందర్భంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాములకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అవి కూడా మనల్ని ఇబ్బందులకు గురి చేయవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook