Shani Dev Favorite Lucky Zodiac Signs Effect: శని దేవుడిని న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడు వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. జీవితంలో ఏదైనా చెడు పనులు చేస్తే శని దేవుడు కూడా అనేక రకాల అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తాడని శాస్త్రం చెబుతోంది. అదే మంచి పనులు చేస్తే బోలెడు ప్రయోజనాలు అందిస్తాడట. అందుకే ఏలినాటి శనితో బాధపడే వారు ఆచితూచి జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. మార్చి 29వ తేదీన శని మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారిపై ఏలినాటి శని ప్రభావం తొలగిపోయింది..
అంతేకాకుండా శనికి దగ్గర సంబంధం ఉన్న రాశులు కూడా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రాశుల వారు శని ప్రభావంతో ఎల్లప్పుడూ ఊహించని లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా డబ్బు పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతూ ఉంటాయి. అయితే శనికి ఇష్టమైన రాశులేవో? ఏయే రాశుల వారు ఎల్లప్పుడూ లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
మకర రాశి
మకర రాశిని శని పాలిస్తూ ఉంటాడు.. అందుకే శని ప్రభావం వల్ల ఈ రాశి వారు ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉంటారు. అలాగే అదృష్టవంతులు కూడా అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఓర్పుతో అంకితభావంతో పనులు చేస్తూ జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అంతేకాకుండా ప్రతి పనిలో విజయం సాధించే అదృష్టాన్ని కూడా పొందుతారు. వీరికి ఉన్నత పదవులు లభించడమే కాకుండా విశేషమైన లాభాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారు కూడా శనిచే పాలింపబడతారు. అందుకే ఈ రాశి వారు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ పొందుతారు. వీరికి కష్టపడే మనస్తత్వం కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమయాల్లోనైనా కష్టపడి పనులు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటపడతారు. అలాగే వీరికి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది.
కుంభరాశి
శనికి అత్యంత ఇష్టమైన రాశుల్లో కుంభరాశి కూడా ఒకటి. కాబట్టి ఈ రాశి వారు కూడా ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వీరు పట్టుదలతో ఎలాంటి పనులైనా చేయగలుగుతారు. కుంభ రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని పనుల్లో స్వాతంత్రంగా ఆలోచించి ముందుకు వెళ్తారు. వీరికి ఎల్లప్పుడు శని దేవుడి అనుగ్రహం లభించి విజయాలు సాధించే అదృష్టాన్ని కూడా కలిగి ఉంటారు. అందుకే వీరు ప్రతి శనివారం శని దేవుడిని పూజించడం మంచిది.
తుల రాశి
తులా రాశి వారికి కూడా శని ప్రభావం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి వీరు విశేషమైన ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. వృత్తిపరమైన జీవితంలో కూడా తులా రాశి వారు అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు. కష్టపడి పని చేసే స్వభావం ఉండడం వల్ల వీరు అనేక రకాల పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైన జీవితం కూడా తులా రాశి వారికి ఎంతో బాగుంటుంది. ఈ రాశి వారు ఎలాంటి పనులు చేసిన.. ధైర్యంగా విజయాలు సాధిస్తారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









