)
Saturn Direct Movements Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని కార్యదేవుడిగా, న్యాయమూర్తిగా భావిస్తారు. అందుకే శని దేవుడికి, గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో ఈ గ్రహం ప్రథమ స్థానంలో ఉంటుంది. శని గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర ఏళ్ల పాటు సమయం పడుతుంది. అంతేకాకుండా కదలికలను బట్టి రాశుల వారిపై ఏలినాటి శని ప్రభావం కూడా ప్రారంభమవుతుంది.
నిజానికి శనిగ్రహం రాశుల వారు చేసే కార్యాలను బట్టి ఫలితాలను అందిస్తుంది. జీవితంలో నలుగురికి మంచి చేస్తే తప్పకుండా శనిగ్రహం మంచి ఫలితాలను అందిస్తుంది. అదే ఈ గ్రహం జీవితంలో ఒకరు నష్టపోవాలని ఏవేవో పనులు చేస్తే.. చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే శని దేవుడిని కార్యఫల ప్రదాతగా చెప్పుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం నవంబర్ 28న కదలికలు జరపబోతోంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
మేషరాశి
మేషరాశి వారికి శని గ్రహం ప్రత్యక్షమైన చలనం కారణంగా కొంత మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఇప్పటివరకు వచ్చిన అడ్డంకులన్నీ నవంబర్ 28వ తేదీ నుంచి తొలగిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల ప్రమాదాలు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు అదృష్టం అనుకూలంగా మారి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ ఉద్యోగాలపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. జీవితంలో సంతోషం కూడా రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శని అనుగ్రహం నవంబర్ 28వ తేదీ నుంచి లభించబోతోంది. వీరికి కార్యాలయాల్లో పనికి తగ్గ ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కష్టపడి పని చేయాలనే భావన కూడా కలుగుతుంది. ఇక ఈ సమయంలో ఎలాంటి పనులు ఇచ్చిన ఎంతో చక్కగా సులభంగా చేయగలుగుతారు. ఎప్పటినుంచో ఉద్యోగాలు మారాలని చూస్తున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు.. గతంలో తీసుకున్న పాత రుణాలు కూడా ఈ సమయంలో తిరిగి చెల్లించబోతున్నారు. అప్పులు తీరిపోవడం వల్ల మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది.
తులారాశి
తులారాశి వారికి శని ప్రత్యక్షమైన కదలికల కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న గొడవలు కూడా సులభంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి కొత్త ఆస్తులతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, మీకుండే భక్తిపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ న్యూస్ ధృవీకరించదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook