
Shani Dev On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో శని గ్రహం ఒకటి. ఈ గ్రహానికి అత్యంత శక్తి ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తులు చేసే కర్మలకు ఫలితాలు కూడా అందిస్తుంది. జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే మీరు చేసే కర్మలను బట్టి ఫలితాలు, ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఇతరులకు మేలు చేస్తే.. మీకు కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే ఇతరులకు ఆటంకాలు కలిగిస్తే మీరు కూడా తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఇదిలా ఉంటే అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శనిగ్రహం కూడా ఒకటి. ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి సంపాదన గౌరవం వ్యక్తిగత పురోగతి వంటి అన్ని అంశాల్లో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
శని ఆగస్టు 18వ తేదీన ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రహం మీన రాశిలో సంచార దశలో ఉంది. అక్టోబర్ 3వ తేదీన పూర్వ భాద్రపాద నక్షత్రంలోకి శని సంచారం చేయబోతోంది. ఈ నక్షత్రానికి దేవ గురువు బృహస్పతి ఆధిపతిగా వ్యవహరిస్తాడు. అక్టోబర్ నెలలో శని నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఈ సమయంలో ఉపశమనం లభించబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే శని పూర్వ పాత్ర పాద నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా.. ఏయే రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
మిధున రాశి
శని సంచారం కారణంగా మిథున రాశి వారికి జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని ప్రభావం వల్ల వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా వీరు సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మకర రాశి
మకర రాశి వారికి శని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరు కష్టపడి పనిచేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే స్నేహితుల నుంచి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. జీవితంలో ఎన్నడూ పొందలేని అపారమైన ధన లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా స్నేహితుల సహకారంతో కొన్ని చేయకూడని పనులు కూడా చేసి అద్భుతమైన విజయాల సాధిస్తారు.
కుంభరాశి
కుంభరాశి వారికి శని సంచారం వల్ల సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమౌతాయి. వీరికి ఉద్యోగంలో హోదాతో పాటు కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా లభిస్తాయి. ఈ సమయంలో కుంభ రాశి వారు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించిన మంచి లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు కూడా చాలా సక్రమంగా ముందు కొనసాగుతాయి. ఎల్లప్పుడు ప్రశంసలు పొందే, ఈ రాశుల వారు ఈ సమయంలో తప్పకుండా గౌరవాన్ని పొందుతారు. అంతేకాకుండా వీరికి ఉద్యోగాలపరంగా కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేసి అపారమైన ధన లాభాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి