)
Shani dev Transit: సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించాడు.దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం వరించబోతుంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టాలు మాయం కాబోతున్నాయి. శనిదేవుని అనుగ్రహం వల్ల అన్ని సుఖాలు అందుకుంటారు.
కర్కాటక రాశి..శనీశ్వరుడు మీన రాశి సంచారముతో, కర్కాట రాశి వారికి శని నీడ ప్రభావం నుండి పూర్తిగా విముక్తి పొందారు. ఇంకా ఏమి జరిగినా, ఈ రాశి వారికి శని దేశం ప్రారంభమవుతుంది. అదృష్ట వల్ల, డబ్బు చేతికి అందుతుంది. అంతేకాదు జీవితంలోని ప్రతి రంగంలోనూ పురోగతి సాధిస్తారు.
తుల రాశి: శని దేవుడికి తులా రాశి ఉచ్చ రాశి. అందుకే శని దేవుడు మీన రాశి ప్రవేశంతో తులా రాశిలో జన్మించిన వారికి గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోతాయి. శని ప్రభావం వల్ల ఆస్తి, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా యేల్లు మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.
వృషభ రాశి:శని దేవుడు మీనరాశి సంచార ప్రభావం కారణంగా.. ఈ రాశి వ్యక్తులు వారికి వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలను అందుకుంటారు. ౌకొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకోని ఫలితాలు అందుకుంటారు. అంతేకాదు మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగులోనూ మీ అండగా ఉంటారు. గతంలో కంటే మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మిథున రాశి: శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశించడం తర్వాత మిథున రాశిలో జన్మించిన వారికి అనుకోని లాభం కలగబోతంది. గతంలో కంటే వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి. అంతేకాదు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ పనికి మీ ఉన్నతాధికారుల నుండి కూడా ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. మీ చిరకాల కోరిక నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రానుసారంతో పాటు సాధారణ నమ్మకాలు, పండితుల సూచనలు..సమాచారంపై ఆధారపడి ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe