Shukra Gochar: జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటే, జీవితంలో ఆనందం, శాంతి, సామరస్యం, శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు. నవగ్రహాల్లో శుక్రుడు సంపద, విలాసం, అందం, కళ, ప్రేమను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న శుక్రుడు నక్షత్ర మార్పు కారణంగా ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉంటే, జీవితంలో సంతోషం, సౌభాగ్యం, శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు. శుక్రుడు సంపద, విలాసం, అందం, కళ, ప్రేమను ఇచ్చే గ్రహంగా భావిస్తారు.
కుంభ రాశి: శుక్రుడు కుంభ రాశి మార్పు వలన జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. చేసే పనిలో ప్రమోషన్ అందుకుంటారు. అంతేకాదు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేసే వ్యాపారంలో రెట్టింపు లాభం ఉంటుంది. మీరు అనేక విధాలుగా డబ్బు సంపాదించు కోవచ్చు. భార్యాభర్తల అనురాగం వెల్లివిరుస్తుంది. భూమి,లేదా ఇంటిని కొనుగోలు చేస్తారు.
మీనం రాశి..
శుక్ర సంచారము కారణంగా, మీన రాశి వారి జీవితాల్లో పలు మార్పులు సంభవించబోతున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శుక్రుడు అత్యున్నత స్థానంలో సంచరించడం వలన మీన రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. అది ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా, మీ మాటలు ఎంతో ప్రశంసించబడతాయి. పేరు ప్రతిష్టలు మరింతగా రాణిస్తాయి. డబ్బు సమస్యలు పరిష్కారమవుతాయి. జీవితంలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం, జ్యోతిష్యం, పండితులు సలహా మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్ దీనిని అంగీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









