)
Siddha Yoga Powerful Effect On Zodiac: ఈరోజు ఆదివారం నవంబర్ 9.. ఈరోజుకి పాలకుడిగా సూర్యుడు ఉన్నాడు. అలాగే చంద్రుడు మిథున రాశిలో, బుధుడు ఎనిమిదవ స్థానంలో, కొన్ని గ్రహాలు శుభస్థానంలో సంచార దశలో ఉన్నాయి. అందుకే ఈరోజుకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో ప్రత్యేకత కలిగిన సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రాజయోగం ఏర్పడడం కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు ఆశీస్సులు కలగడం.. ఇలా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా మారింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ ఆదివారం బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రాబోతోంది. అయితే ఈ సిద్ద యోగం (Siddha Yoga) వల్ల ఈరోజు నుంచి రేపటి వరకు ఈ క్రింది రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
ఆది, సోమ అదృష్ట రాశి ఫలాలు..
మేషరాశి
మేష రాశి వారికి రాజకీయ సామాజిక రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ధైర్యం కూడా పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త నైపుణ్యాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇనుప, బంగారం, రాగి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే దగ్గరి బంధువులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆనందం విపరీతంగా పెరగడమే కాకుండా పూర్వీకుల ఆస్తుల నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విహారయాత్రలకు కూడా వెళ్తారు.
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ సమయం సంతోషకరంగా మారుతుంది. ఎందుకంటే వీరు ప్రణాళికలతో ఈరోజు అన్ని పనులు చేయగలుగుతారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతాయి. అలాగే రుణగ్రస్తులతో కఠినంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు భాగస్వామి నుంచి మంచి సపోర్టు లభించబోతోంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మొత్తం ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సిద్ధయోగ ప్రభావంతో అదృష్టం పెరిగి కొన్ని గుడ్ న్యూస్ లు కూడా వింటారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు సిద్ధయోగ (Siddha Yoga) ప్రభావంతో ఈ సమయం చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటి వరకు వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సాంకేతిక జ్ఞానం పెరిగి వృత్తిపరంగా కూడా రాణించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లభించి.. కొత్త కొత్త ప్రణాళికలతో పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకున్న పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వార్తను జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook