Snakes In Dream: కలలో అదే పనిగా పాములు కన్పిస్తున్నాయా..?.. మీ లైఫ్‌లో నూటికి నూరుపాళ్లు జరిగేది ఇదే..!

Cobra Snake Effect: చాలా మంది కలలో తరచుగా పాములు కన్పిస్తున్నాయని తెగ కంగారు పడిపోతుంటారు. అదే విధంగా కొన్నిసార్లు పాములు కాటేసినట్లు కూడా కలలు కంటారు. అయితే.. దీని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2025, 08:53 PM IST
  • కలలో పాములు కన్నించే సమస్య..
  • ఈ నియమాలు పాటించాలంటున్న పండితులు..
Snakes In Dream: కలలో అదే పనిగా పాములు కన్పిస్తున్నాయా..?.. మీ లైఫ్‌లో నూటికి నూరుపాళ్లు జరిగేది ఇదే..!

Snakes in dream Effect on human life: కొంత మంది తరచుగా కలలో పాములు కన్పిస్తున్నాయని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు పడుకొగానే సర్పాలు వాళ్లమీద నాట్యం చేసినట్లు కన్పిస్తాయి. మరికొందరికి పాము కాటు వేసినట్లు కలలు పడతాయి. ఇంకా కొందరికి పాములు తమ పక్కన వచ్చి బుసలు కొట్టినట్లు కలలు పడతాయి. అయితే.. కలలో పాములు తరచుగా కన్పించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు .

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా ఇంట్లో పెద్దలు లేదా పూర్వీకులు తెలిసీ లేదా తెలియకుండా పాముల్ని చంపితే కాలసర్పదోషం చుట్టుకుంటుంది. దీని వల్ల ఉద్యోగ జీవితంలో అదే విధంగా సంసారంలో కూడా ఒక ఆనందం ఉండదు. ప్రతి దాంట్లో కూడా నిరాశ ఉంటుంది. అదే విధంగా పాములు కలలో కన్పించి కాటు వేసినట్లుకలలు పడితే మాత్రం వెంటనే పండితులను కలిసి కొన్ని పూజలు చేయించుకొవాలి. ముఖ్యంగా ప్రతి మంగళవారం నాడు, జంట నాగులు ఉన్న ఆలయంలోకి వెళ్లాలి. అక్కడ ప్రత్యేకంగా పూజలు చేయాలి.

అంతే  కాకుండా.. పాములకు పాలాభిషేకం,పెరుగు, తేనె,చక్కెరతో అభిషేకం చేయాలి. ఇలా సర్పాన్ని కోలుచుకుంటే క్రమంగా కాలసర్పదోషాలన్ని పోతాయి. అంతేకాకుండా.. జంట నాగుల్ని కూడా పూజించుకొవాలి. ఇలా చేస్తే సర్పదోషాలు పోతాయి.  చాలా చోట్ల కాలసర్పదోషాలు ఉన్నవారికి.. రాహు,కేతు పూజలుచేయిస్తారు.

Read more: Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు..?.. విశిష్టత.. ఆ రోజు బంగారం  ఎప్పుడు కొనాలంటే..?  

అంతేకాకుండా.నాగ ప్రతిష్ట సైతం చేయిస్తారు. ఇలాంటి కార్యక్రమాలతో కాలసర్పదోషాలు పూర్తిగా దూరమౌతాయి. సర్పాలు కన్పిస్తే.. వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకూడదు.అదే విధంగా ఎవరైన సర్పాలకు అపకారం తలపెట్టిన కూడా, వాటిని వేధిస్తున్న ఘటనలు కూడా చూస్తే కాలసర్పదోషం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా.. నవనాగ స్తోత్రం చదివిన కూడా కాలసర్పదోషాల నుంచి బైటపడొచ్చు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News