Solar Eclipse 2025: ప్రతి ఏటా రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు తప్పనిసరిగా ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఇవి పాక్షికంగా ఉంటే మరి కొన్ని దేశాల్లో సంపూర్ణంగా ఉంటుంటాయి. అందుకే కొన్ని దేశాల్లో అసలు కన్పించవు.
ఈ ఏడాది అంటే 2025లో మార్చ్ 14వ తేదీన మొదటి చంద్ర గ్రహణం ఏర్పడగా మార్చ్ 29న సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ రెండూ భారతదేశంలో కన్పించలేదు. మరో రెండు గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి, కన్పిస్తాయా లేవా అనేది తెలుసుకుందాం. ఈ ఏడాదిలో సంభవించనున్న రెండవ సూర్య గ్రహణం 2025 సెప్టెంబర్ 21న ఉంది. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3.24 గంటల వరకు ఉంటుంది. మొత్తం 4 గంటల 24 నిమిషాలు ఉంటుంది. ఈ సూర్య గ్రహణం కూడా ఇండియాలో కన్పించదు. కేవలం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతాల్లో కన్పిస్తుంది.
గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు
హిందూ జ్యోతిష్యం ప్రకారం సూర్య, చంద్రులు గ్రహణంలో ఉన్నప్పుడు వాటి శక్తి తగ్గుతుందంటారు. అందుకే ఆ సమయంలో ఎలాంటి పూజలు చేసినా ఫలితం ఉండదు. అందుకే గ్రహణాన్ని హిందూ మతంలో అశుభంగా పరిగణిస్తారు. గ్రహణం సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి మరింత చురుగ్గా ఉంటుందని నమ్ముతారు.
అందుకే గ్రహణం సూతక సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పూజలు చేయరు. పవిత్ర గ్రంథాల పారాయణం చేయాలి. భగవంతుడిని ధ్యానించి మంత్రాలు పఠించాలి. గర్భిణీ మహిళలు బయటకు వెళ్లకూడదు. గ్రహణ సమయం ముగిసేవరకు భోజనం వండకూడదు తినకూడదు. గ్రహణానికి ముందే భోజనం చేసి ఉంటే వాటిని తులసి ఆకులతో కప్పి ఉంచాలి. సూతక కాలం ముగిసిన తరువాత ఇళ్లంతా గంగా జలంతో చల్లాలి.
గమనిక
గ్రహణానికి సంబంధించిన ఈ విషయాలు కేవలం మత విశ్వాసాల ఆధారంగా రాసినవి. పాఠకుల ఆసక్తి కోసం వివిధ జ్యోతిష్య పండితుల సూచనల మేరకు ఇచ్చినవి. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.
Also read: Shani - Guru Gochar: త్వరలోనే శని, బృహస్పతిల అపూర్వ కలయిక.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









