Sri Rama Navami: శ్రీ రామనవమి రోజున సీతా రాముల వారికి తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యాలు ఏంటో తెలుసా..?

Sri Rama Navami celebrations: శ్రీరామ నవమి రోజున భక్తులు రామయ్యను భక్తి ప్రపత్తులతో పూజించుకుంటారు. ఈ రోజున రాముల వారికి ఇష్టమైన నైవేద్యాలను చూపిస్తే రాముడి అనుగ్రహం తొందరగా పొందుతామని పండితులు చెబుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 5, 2025, 12:00 PM IST
  • శ్రీరామ నవమి ఉత్సవాలు..
  • ముస్తాబైన ఆలయాలు..
Sri Rama Navami: శ్రీ రామనవమి రోజున సీతా రాముల వారికి తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యాలు ఏంటో తెలుసా..?

Sri rama Navami celebrations puja Vidhi: శ్రీ రామనవమి వేడుకల్ని దేశ వ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఇప్పటికే రాముడి ఆలయాలన్ని అందంగా ముస్తాబు చేశారు. అయితే.. శ్రీరామ నవమిని ఈసారి మనం ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజున జరుపుకుబోతున్నాం. ఈ క్రమంలో శ్రీరాముడిని ఏ విధంగా పూజించుకొవాలో భక్తులు పలు విషయాలను వెల్లడించారు. చాలా చోట్ల శ్రీరామ నవమి రోజున ఉదయం పూట నిద్రలేచి, తమపనులు చేసుకుంటారు. శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. ముఖ్యంగా చాలా మంది సాంప్రదాయ దుస్తుల్లో రాముల వారి ఆలయానికి వెళ్తారు. ఈసారి శ్రీరామ నవమి అనేది ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు 8 వరకు నవమి తిథి ఉంది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో శ్రీరామ నవమి రోజున భక్తులు చాలా చోట్ల మధ్యాహ్నం అభిజిత్ లగ్నం వేళ రాముల వారి కళ్యాణోత్సవంను నిర్వహిస్తారు. అదే విధంగా శ్రీ రాము వారికి పట్టు వస్త్రాలను సైతం అర్పిస్తారు. రామ నవమి రోజున ప్రత్యేకంగా పూలతో అందంగా అలంకరిస్తారు. శ్రీరామ నవమి రోజున.. చాలా మంది తమ ఇళ్లలో చక్కెర పొంగలి, బెల్లంపానకం, వడపప్పు, పులి హోరలను చేసి నైవేద్యం చూపిస్తారు. బెల్లం పానకం , శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అందుకే బెల్లం పానకంను తప్పకుండా రామయ్యకు అర్పిస్తారు.

Read more: Sri Ramanavami: శ్రీ రామనవమి విశిష్టత.. ఈ రోజున తప్పకుండా పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు ఇవే..

అదే విధంగా రాముల వారికి ముఖ్యంగా.. లడ్డులు కూడా నైవేద్యంగా చూపిస్తారు. ఈ పదార్థాలను నైవేద్యంగా చూపిస్తే రాముల వారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. పైన చెప్పిన పదార్థాలను నైవేద్యంగా చూపిస్తే రాముల వారి అనుగ్రహంతో కష్టాలన్ని దూరమౌతాయని పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా శ్రీ రామ నవమి రోజున .. రామాయణం, సుందర కాండ, శ్రీరామ చరిత్ మానస్ వంటి గ్రంథాలు చదివితే మనస్సులోని కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు. 

శ్రీ రామ నవమి రోజున తప్పకుండా తలస్నానం చేయాలి. ఎట్టిపరిస్థితుల్లో కూడా కటింగ్ తీయించుకొవడం లేదా గోర్లు తీయడంలాంటి పనుల్ని అస్సలు చేయకూడదు. అదేవిధంగా ఈరోజున ఉపవాసం చేస్తే జాతకంలోకి దోషాలన్ని పోతాయంట. ఈరోజున ఏపని ప్రారంభించిన కూడా తప్పకుండా ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News