Ramayan: రామాయణం ఎందుకు చదవాలి? ఆసక్తికర రహాస్యాలు ఇవే!

Why To Read Ramayan Know Secrets: శ్రీరాముడి జీవితం గురించి తెలిపే 'రామాయణం'లో ఏముంటుంది? అంటే ఏమీ లేదని చెప్పవచ్చు. కానీ ఆ పుస్తకం చదివి అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది. రాముడి అంతటి అందమైన జీవితం మన సొంతమవుతుంది. అందుకే రామాయణం చదవాలి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 5, 2025, 02:55 PM IST
Ramayan: రామాయణం ఎందుకు చదవాలి? ఆసక్తికర రహాస్యాలు ఇవే!

Why To Read Ramayan: భారతీయ సంస్కృతికి ఎంతో గొప్పది. యావత్‌ ప్రపంచానికే మార్గనిర్దేశం అందించే గొప్ప కథలు భారతదేశంలో ఉన్నాయి. మత గ్రంథాలైన మహాభారతం, భాగవతం, రామాయణం, వేదాలు కేవలం హిందూ మతం గొప్పతనమే కాదు మానవ జీవిత పరమార్థం.. జీవన శైలి.. సమాజం గురించి తెలిపే గొప్ప పుస్తకాలు అవి. సమాజాన్ని మార్చివేసే గొప్ప సాంఘిక పుస్తకాలుగా చెప్పవచ్చు. ఇక శ్రీరాముడి జీవితం తెలిపే రామాయణం కూడా తత్వశాస్త్రం లాంటి పుస్తకం. ఒక వ్యక్తి జీవితం గురించి ఉండే రామాయణం పుస్తకం ఎందుకు చదవాలో తెలుసా? ఆ పుస్తకంలో ఏముందో శ్రీరామనవమి సందర్భంగా తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Shani Dev Favorite Zodiac Signs Telugu: శని దేవుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడూ డబ్బే డబ్బు..

ఆదర్శవంతమైన జీవితానికీ, దివ్యమైన జీవితం గడపడానికి మార్గదర్శకంగా రామాయణం నిలుస్తుంది. రామాయణంతో జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు. రామాయణం ఉత్తమ సంస్కారాన్ని అలవాటు చేస్తుంది. సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. వ్యక్తితో మొదలైన సంస్కారం కుటుంబంలో, సమాజంలో వికసించాలి. దానివల్ల దేశం, ప్రపంచం చక్కబడతాయనేది రామాయణం ద్వారా అర్థమవుతుంది. సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించే విధానాన్ని 'వసుధైక కుటుంబం' అనే వేదవాక్కుకు రామాయణం సార్ధకత చేస్తుంది. మనల్ని మనమే కాదు, సమాజాన్నీ, తద్వారా మానవులందరినీ రక్షించుకోవడానికి రామాయణం తోడ్పడుతుంది.

Also Read: Saturn And Mercury Conjunction Effect: 30 ఏళ్ల తర్వాత ఒకే నక్షత్రంలో శని, బుధల కలయిక.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్‌ స్టార్ట్..

దాంపత్య ధర్మం
భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధాన్ని తెలిపేది రామాయణం. వైదిక సంస్కృతిలో దాంపత్య ధర్మం అతి పవిత్రమైనది. ఈ విషయాన్ని వాల్మీకి రామాయణంలో పలుమార్లు ప్రస్తావించాడు. సీతారాముల మధ్య నెలకొన్న ప్రేమానుబంధం అపురూపమైనది, ఆదర్శవంతమైనది. 
"ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణై రూప గుణై శ్చైవ భూయ ఏవాభ్య వర్ధత
తస్యాశ్చ భక్తా ద్విగుణాం హృదయే పరివర్తతే"

అనే పద్యం సీతారాముల పవిత్రమైన ప్రేమను వివరిస్తుంది. రాముడికి సీత అంటే అమితమైన ప్రేమ. తండ్రి వివాహం జరిపించడం.. సౌందర్యవతి, సద్గుణాలు రాముడి హృదయాన్ని ఆకట్టుకోవడంతో ఆ ప్రేమ మరింతగా పెరిగింది. సీతకు రాముడి మీద ప్రేమ అనిర్వచనీయమైనది. దాంపత్యానికి ఉన్న పవిత్రత రామాయణంలో పలుచోట్ల చక్కగా వర్ణన ఉంటుంది. కోడలిగా.. భార్యగా తన విధులను దుఃఖంలో కూడా సీత నిర్వర్తించడం రామాయణంలో కనిపిస్తుంది. మానవుల్లోనే కాదు, రాక్షసుల్లో కూడా దాంపత్యానికి ఉన్న పవిత్రతను మండోదరి ద్వారా వాల్మీకి తెలిపాడు.

ఆదర్శాలు నేర్చుకోవడానికి...
గురుభక్తి, దయ, కరుణ తదితర గుణాలు కుటుంబంలోని పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమించాలి. పిల్లలు తమ కర్తవ్యాన్ని విస్మరించకుండా వారికి శిక్షణ ఇవ్వాలి. రామాయణంలో రాముడు ప్రదర్శించిన సుగుణాలను అనుసరించాలి. దానికోసం రామాయణం తప్పకుండా చదవాలి.

నిస్వార్థ ప్రవృత్తి కోసం
'అర్థం (డబ్బు) అన్ని అనర్థాలకూ మూలం' అనేది నానుడి. సుఖమయ జీవితానికి అర్థం (సంపద) అవసరమే కావచ్చు. అదే పరమార్థం అనుకుంటే అంతకన్నా అనర్థం లేదు అని రామాయణం చెబుతోంది. రాముడు వనవాసానికి వెళ్లే సమయంలో రాముడు చెప్పిన మాటలు నేటి మానవుడికి ఆదర్శనీయం. 'నేను అర్థ ప్రధానుణ్ణి కాను. నేను మంచి మార్గంలో నడుస్తూ, జగత్తును సక్రమమైన దారిలో నడిపించాలన్నదే నా కోరిక. నేను ప్రాధాన్యమిచ్చేది ధర్మానికే' అని రాముడు చెప్పాడు. అంటే డబ్బుకు విలువనివ్వను.. ధర్మానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పడమే కాదు చేసి చూపించాడు.

వ్యక్తిత్వ వికాసానికి...
ఓర్పు.. సహనం కలిగి ఉండాలని రామాయణం చెబుతోంది. కష్టాలు, నష్టాలను తట్టుకోలేక దారుణాలకు పాల్పడుతున్న సమాజానికి రామాయణం చక్కటి స్ఫూర్తినింపుతుంది. కష్టాలను ధైర్య సాహసాలతో ఎదుర్కోవడమే జీవితానికి ఉత్తమ ఆదర్శమని రామాయణం చాటి చెబుతోంది. హనుమంతుడు, సీత, రాముడు ఇలా అన్ని పాత్రాలు జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నా ధైర్యంగా పోరాడి చివరికి విజయం సాధించారు. 'అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం" అని ఆంజనేయుడు ఓ వాక్యం చదువుతాడు. అది 'దిగులు చెందకుండా ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. అదే సమస్త సుఖాలకూ మూలం' అని చెప్పి హనుమంతుడు అనంతరం సీత జాడను కనుక్కుని రామాయణం పరిపూర్తి చేశాడు. 'వినాశే బహవే దోషా జీవన్ ప్రాప్నోతి భద్రకమ్' "మరణిస్తే ఏముంది? అన్నీ దోషాలే అని ఆంజనేయుడు మరో చోట చెప్పాడు.

మన జీవితంలోనూ..
ఆదర్శ జీవితం గడుపుతూ, ధర్మపాలన.. రాజ్యంలో అందరి క్షేమం.. సంతోషం కోరి రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఈనాటి ప్రభుత్వాలకూ, అధికారులకు ఎంతో ఆదర్శం. మానసిక చైతన్యం, ధైర్య స్థైర్యాలు, నీతి, నిజాయతీలు, కార్యసాధనా నైపుణ్యం వంటివి వ్యక్తిత్వ వికాస పాఠాలు రామాయణం ద్వారా తెలుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి. చదివి రామాయణం నుంచి నేర్చుకున్న పాఠాలను జీవితంలో అన్వయించుకుంటే పరమార్థం ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News