Sri Vishwavasu Ugadi 2025: వివిధ రాష్ట్రాల్లో ఉగాదిని ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసా..

Sri Vishwavasu Ugadi 2025: ఉగాది తెలుగు సంవత్సారాది. కొత్త సంవత్సరానికి కొత్త భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతూ జరుపుకునే పండుగ. ఈ సారి శ్రీవిశ్వావసు నామ సంత్సరం 39వది. దీన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఏయే రాష్ట్రాల్లో ఏయే పేర్లతో సెలబ్రేట్ చేసుకుంటారనే విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2025, 12:52 PM IST
 Sri Vishwavasu Ugadi 2025: వివిధ రాష్ట్రాల్లో ఉగాదిని ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసా..

Sri Vishwavasu Ugadi 2025: తెలుగు సంవత్సరాది యుగాదిని పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటూ ఉంటారు.  మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పంజాబ్, బెంగాల్ లలో వేరు వేరు పేర్లతో ఉగాది పండగను సెలబ్రేట్ చేసుకుంటారు ఆయా రాష్ట్ర ప్రజలు. పేర్లు ఏదైనా కావొచ్చు కానీ.. అన్నింటిలోనూ కనిపించేది బంగారు భవిష్యత్తే. మరాఠీల ఉగాదిని గుడిపడ్వా గా జరుపుకుంటారు.  తెలుగు వారిలాగే మరాఠీలు కూడా చాంద్రమానాన్నే ఫాలో అవుతారు.  అందుకే గుడిపడ్వా పండుగ కూడా చైత్రశుద్ద పాడ్యమినాడే వస్తుంది. పడ్వా అంటే పాడ్యమి అని అర్థం. ఈ పండుగ రోజు వీరు మన ఉగాది పచ్చడి లాంటిదే తయారు చేస్తారు. బ్రహ్మా దేవుడు సృష్టి ఆరంభించిన రోజు కాబట్టి దానికి గుర్తుగా బ్రహ్మధ్వజం నిలుపుతారు. వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పి, పూలతో ఆలకరించి పైన వెండి లేదా కంచుపాత్రలు బోర్లిస్తారు. గుడిపడ్వా రోజు ఈ బ్రహ్మధ్వజాలను తప్పని సరిగా ప్రతిష్టిస్తారు.

Add Zee News as a Preferred Source

ఇక బెంగాలీల కొత్త సంవత్సరం వైశాఖమాసంతో మొదలవుతుంది. బెంగాలీ కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. అందుకే వైశాఖ శుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. దీన్ని పోయ్ లా బైశాఖ్ అంటారు. సిక్కులు సౌరమానాన్ని పాటిస్తారు. కాబట్టి దీని ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. ఇది ప్రతిఏటా ఏప్రిల్ 13న వస్తుంది.

తమిళనాడులో కొత్త సంవత్సరం వేడుకలను పుత్తాండుగా పిలుస్తారు. ఒకప్పుడు తమిళనాడులోనూ, తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగానే ఒకే సమయంలో జరిగేవి. ప్రస్తుతం ఉగాది పండగను చిత్తిరై తిరునాళ్ గా జరుపుకుంటున్నారు. మళయాళంలో విషు అంటారు. వీరు కూడా సౌరమానాన్నే అనుసరిస్తారు.అందుకే వీరి ఉగాది కూడా ఏప్రిల్ నెలలోనే వస్తుంది.

రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండుగ ఉగాది. ఉదయం అభ్యంగనస్నానంతో మొదలైన ఈ పండుగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాదినాడు పంచాంగ శ్రవణం తప్పని సరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం ఎలా జరగబోతుందో తెలుస్తుంది. ఈ పండుగకు ఇదే అదిపెద్ద హైలెట్ అని చెప్పాలి. మరే పండుగకీ లేని పంచాంగ శ్రవణం ఈ పండగ ప్రత్యేకం అని చెప్పాలి.

కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకోవడానికి అవసరమైన గ్రహ శాంతులు జరిపించుకుని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే అయిదు అంగములు అని అర్థం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలు. వీటన్నింటీనీ తెలిపేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరుణ ఫలితాన్ని తెలుసుకుంటే గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందని శాస్త్ర వచనం. . ప్రస్తుతం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ నే ఫాలో అవుతున్నారు. కానీ శుభకార్యాలు, పూజలకు, పితృదేవతారాధన వంటి వాటికి తప్పనిసరిగా పంచాంగాన్ని వాడుతున్నారు. పూర్వం  పంచాంగం తాటాకుల మీద రాయబడేది కాబట్టి అందరికి అందుబాటులో ఉండేకపోయేది. అందుకే ఉగాది రోజు ఊరు మొత్తం గుడిముందో.. లేక ఏదైనా ప్రదేశంలోనో ఒక చోట చేరి పంచాంగ శ్రవణం చేసేవారు. కానీ ఇప్పుడు పంచాంగం అందిరికి అందుబాటులోకి వచ్చేసింది. దీంతో పంచాంగ శ్రవణాల ప్రాముఖ్యతా తగ్గిపోయింది. ఊరు మొత్తం కలిసి చేసుకునే ఈ పండుగ ఇప్పుడు గుళ్లకు మాత్రమే పరిమితమయింది.

ఉగాది పేరు వింటే పచ్చడి, భక్ష్యాలే కాదు మరొకటి కూడా గుర్తుకువస్తుంది. అవే కవిసమ్మేళనాలు.. సరస్వతీ పుత్రులైన కవులు, రచయితలను గౌరవించుకునే సంప్రదాయమే ఈ కవి సమ్మేళనాల ప్రాముఖ్యత.ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా  దేశ విదేశాల్లో తెలుగువారు ఉండే అనేక ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు ఇప్పటికీ  నిర్వహిస్తూ ఉంటారు.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News