Sun Transit 2025 Effect On Zodiac: ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఒక సంవత్సరంలో సూర్యుడు తప్పకుండా 12 గ్రహాలు చుట్టేస్తాడు అందుకే సూర్యగ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యగ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సమాజంలో గౌరవం, ఆనందం, శ్రేయస్సుకు సూచిక గా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం రాశి మారినప్పుడల్లా అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మార్చి 15వ తేదీన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో అత్యంత అద్భుతమైన లాభాలు పొందబోయే రాశుల్లో మీన రాశి కూడా ఉండబోతోంది. ఈ రాశి తో పాటు లాభాలు పొందే ఇతర రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు సంచారం చేయడం వల్ల ఎక్కువగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆనందం రెట్టింపు అవుతుంది దీంతో పాటు సమాజంలో శ్రేయస్సు కూడా లభిస్తుంది అలాగే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. మార్చి 15వ తేదీన జరిగే సంచారం వల్ల ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
మీన రాశి:
సూర్యుడి సంచారం మీన రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా.. వీరు గుడ్ న్యూస్ కూడా వింటారు. ఇక అవివాహితలకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. కుటుంబంలో మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించబోతున్నారు. మీనరాశిలో జన్మించిన వారు ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారబోతోంది. అలాగే వీరికి సమాజం నుంచి ప్రశంశాలు కూడా లభిస్తాయి.
ధనస్సు రాశి:
ఈ సమయంలో అత్యంత లాభాలు పొందబోయే రాశుల్లో ధనస్సు రాశి కూడా ఒకటి.. ఈ రాశి వారు అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. వీరు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా.. కొత్త ఇండ్లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పూర్వీకుల ఆస్తుల నుంచి కూడా గుడ్ న్యూస్ వింటారు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సూర్యుడి సంచారం వల్ల అత్తమామల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. దీనివల్ల కొంతకాలంగా వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు ఈ సమయం గురించి చెప్పనక్కర్లేదు ఈ సమయంలో ఎలాంటి పోటీ పరీక్షలు రాసిన అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు.
మిథున రాశి:
సూర్య గ్రహ సంచారం వల్ల మిధున రాశి వారు కూడా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడమే కాకుండా.. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక కూడా నెరవేరబోతోంది. వ్యాపారాలు చేసే వారు ఈ సమయంలో ఆలోచించి పెట్టుబడులు పెడితే అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









