)
Sun Transit Effect On Zodiac: అన్ని గ్రహాల కంటే సూర్యడు చాలా స్పీడ్‌గా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాడు. ఇటీవలే సంచారం చేసిన సూర్యుడు మరో సారి ఏప్రిల్ 14న మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ సమయంలో సూర్యుడు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తాడు. దీని వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇప్పటికే మేషరాశిలో కుజుడు కూడా ఉన్నాడు. అయితే ఏప్రిల్ 14వ తేది తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.
మేషరాశిలో సూర్యుడు, కుజుడి కలయిక జరగడం ఎంతో శుభప్రదమని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు స్నేకపూర్వకమైనవి.. కాబట్టి కొన్ని రాశులవారికి శుభ ప్రభావం పడుతుంది. దీంతో వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా కూడా విశేషమైన లాభాలు పొందుతారు. అయితే ఈ రెండు గ్రహాల ప్రభావంతో లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
మేషరాశి
సూర్యుడి సంచారం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆర్థికపరంగా కూడా ఈ సమయంలో చాలా వరకు కలిసి వస్తుంది. అంతేకాకుండా అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితంలో కూడా విశేషమైన లాభాలు పొందుతారు.
కర్కాటక రాశి
కుజుడితో పాటు సూర్యుడు మేష రాశిలో కలయిక జరపడం వల్ల కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల సపోర్ట్ లభించి.. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడుతాయి. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికపరంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జన్మించిన వారికి కూడా సూర్యుడి సంచారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వీరు ఉన్న విద్యతో కోసం విదేశాలు కూడా వెళ్తారు. అంతేకాకుండా మంచి విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. సూర్యదేవుడి అనుగ్రహం వల్ల అనుకున్నది అనుకున్న జరుగుతాయి.
మిథున రాశి
మిథున రాశివారికి సూర్యుడి సంచారం ప్రభావంతో ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. తల్లిదండ్రుల సపోర్ట్ లభించి.. అన్ని పనులు బాగా జరుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాల బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు శుభవార్తలు కూడా వింటారు.
సింహ రాశి
సూర్యుడి ఎఫెక్ట్ సింహ రాశివారిపై పడుతుంది. వీరికి అనుకున్న లాభాలతో పాటు పూర్వీకుల ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు అద్భుతమైన లాభాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు కార్యాలయాల్లో కూడా మంచి పేరు సంపాదిస్తారు. అలాగే తోబుట్టువుల సపోర్ట్‌తో అనుకున్న పనులు చేయగలుగుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook