Sun Transit 2023: గ్రహాల్లో అత్యంత శక్తివంతమైంది సూర్యుడు. అన్ని గ్రహాలు రాశి పరివర్తనం చెందినట్టే సూర్యుడు కూడా నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాడు. మే 15వ తేదీన సూర్యుడి వృషభ రాశిలో ప్రవేశించనుండటంతో 5 రాశులవారి జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించినట్టే సూర్యుడు కూడా ఏడాది తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి రాశి పరివర్తనానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. వృషభరాశికి అధిపతి శుక్రుడు అయినందున ధన వైభవాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సూర్యుడు శుక్రుడి రాశిలో ప్రవేశించడంతో అంతులేని కనకవర్షం కురవనుంది. మరోవైపు కెరీర్ విషయంలో కూడా ఊహించని వృద్ధి కన్పిస్తుంది. సూర్య గోచారం ప్రభావం ఏయే రాశుల అదృష్టాన్ని మార్చనుందో తెలుసుకుందాం.


సూర్యుడు మే 15వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించడం కుంభరాశిపై చాలా ప్రభావం చూపించనుంది. ఈ రాశివారికి గౌరవ ప్రతిష్ఠలు సమకూరుతాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి ఊహించని లాభాలుంటాయి. కుటుంబం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. ఆర్ధికంగా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. ఈ రాశివారిపై కనకవర్షం కురుస్తుంది. కొత్త ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది.


సూర్యుడి వృషభ రాశి ప్రవేశం ప్రభావం కర్కాటక రాశిపై ఊహించని విధంగా ఉంటుంది. ఈ రాశి జాతకుల ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. పనిచేసేచోట మీ ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్య తలెత్తదు. 


సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం మీనరాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ విషయంలో చాలా లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తే వ్యాపారులకు కొత్త ఆదాయమార్గాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభాల్ని ఇస్తాయి. ఆరోగ్యపరంగా ఏ సమస్యా ఉండదు. ఆర్ధికంగా పటిష్ట స్థితిలోనే ఉంటారు.


సూర్యుడి వృషభరాశిలో ప్రవేశం ప్రభావం సింహ రాశి జాతకంపై అనుకూలంగా ఉంటుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడే అయినందున సూర్యుడి కటాక్షం తప్పకుండా ఉంటుంది. సూర్యుడి గోచారంతో కెరీర్ బలంగా ఉంటుంది. పనిపై మీ ఫోకస్ మరింతగా పెరుగుతుంది. అందరి మన్ననలు పొందుతారు. ఆర్ధికంగా ఉన్నత స్థితికి చేరుతారు. పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.


సూర్యుడి గోచారం ప్రభావం కన్యా రాశిపై అద్భుతంగా ఉండనుంది. పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఊహించనివిధంగా కనకవర్షం కురవనుంది. 


Also read: Sun-Mercury Transit 2023: సూర్య, బుధ గ్రహాల కలయికతో జూన్ 7 నుంచి ఆ 3 రాశులకు ఊహించని ప్రయోజనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook