)
Sun Transits Powerful Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈరోజున ఎంతో శక్తివంతమైన సూర్య గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. ఏదైనా గ్రహం రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయడం వల్ల ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. అయితే సూర్యుడు ఎంతో ప్రత్యేకత కలిగిన హస్తా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఉన్నత స్థాయిలకు కూడా చేరుకునే అవకాశాలున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి శారీరక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. హస్తా నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల సెప్టెంబరు 27వ తేదీ నుంచి అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడి సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో మార్పులు..
మేషరాశి
మేష రాశి వారికి సూర్యుడు హస్తా నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరు జీవితంలో ఒక కొత్త శక్తిని పొందగలుగుతారు. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో పదోన్నతులు లభించి.. జీతాలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడి గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
తులారాశి
తులా రాశి వారికి కూడా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు చిక్కుకున్న డబ్బులు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాల్లో కూడా స్థిరపడతారు. అలాగే కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది. ఎప్పుడు పొందలేని ఆనందంతో కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాలున్నాయి. వివాదాల నుంచి కూడా ఈ సమయంలో కాస్త పరిష్కారం లభిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు సీనియర్ల నుంచి మద్దతు కూడా పొందుతారు. అలాగే కార్యాలయాల్లో గౌరవం కూడా పెరిగి అనుకున్న పనులు చేయగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కూడా అనుకున్న స్థాయిలో చేయగలుగుతారు. ఎప్పటినుంచో వివిధ సమస్యలతో సతమతమవుతున్న వారికి కాస్త పరిష్కారం లభించబోతోంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇక ఈ సమయంలో అడ్డంకులు రాకుండా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook