)
Sun Transits In Leo Effect On Zodiac: ఆగస్టు 17వ తేదీన సింహరాశిలోకి సూర్యుడు సంచారం చేశాడు. సూర్యుడు కర్కాటక రాశి నుంచి తన సొంత రాశిలోకి సంచారం చేశాడు. దీంతో సూర్యుడు స్థానం మరింత బలపడిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సూర్యుడు బలంగా మారింది కాబట్టి కొన్ని రాశుల వారి జాతకాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయట. సూర్యుడు జాతకంలో బలపడడం వల్ల కొన్ని రాశుల వారికి గౌరవంతో పాటు హోదా కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు పెరిగి జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు సింహరాశిలోకి సంచారం చేసిన కారణంగా ఈ క్రింది 4 రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది.. ముఖ్యంగా అదృష్టం కలిసి వచ్చి ఉన్నట్టుండి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా రాణించగలుగుతారు. అయితే ఈ సమయంలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిధున రాశి
మిధున రాశి వారికి సూర్యుడి సంచారం కారణంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మూడవ స్థానంలోకి సూర్యుడు సంచరించడం వల్ల తెలియపరంగా వీరికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి వ్యాపారంపరంగా ఈ సమయంలో చాలా వరకు కలిసి రాబోతోంది. కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరిగి అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ పరంగా చాలా వరకు జ్ఞానాన్ని పొందుతారు. ఇక వృత్తి జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే మీ పనుల్లో తీవ్రంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన బాగా రాణించగలిగి విజయాలు సాధిస్తారు..
సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుడు సంచారం చేయడం కారణంగా జీవితంలో అనేక ఆహ్లాదకరమైన మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా ఆలోచనకు తగ్గట్టుగా ఈ సమయంలో పనులు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. వీరికి ఈ సమయంలో నైపుణ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. మంచి ఆలోచనలతో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదనలు పొందగలుగుతారు. ఇక ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తులారాశి
తులా రాశి వారికి 11వ స్థానంలోకి సూర్యుడు ప్రవేశించాడు.. దీని కారణంగా వీరికి ఆదాయం పరంగా భారీ మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఊహించని ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే పదోన్నతులు కూడా లభించి గొప్ప గొప్ప ఆదాయ వనరులు పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో వీరు భారీ మొత్తంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడును పెట్టడం వల్ల ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు పెద్దపెద్ద కంపెనీలతో విదేశీ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ఒంటరిగా ఉన్నవారికి సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి తొమ్మిదవ స్థానంలోకి సూర్యుడు సంచారం చేశాడు. దీని కారణంగా వీరికి ఆనందంతోపాటు అదృష్టం విపరీతంగా పెరగబోతా ఉంది. ఆశించిన పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కెరీర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా లక్ష్యాలను సాధించడంలో ఈ ఈ రాశి వారు ముందుంటారు. ఈ సమయంలో ఎలాంటి కఠిన తరమైన పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వీరికి ఈ సమయంలో జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా వీరు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్లగలుగుతారు. అలాగే మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా మెరుగుపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి