Surya Grahanam: నేడు సూర్య గ్రహణం.. మన దేశంలో ఎక్కడా కనిపించని గ్రహణం.. లాభ నష్టాలు ఇవే..

Surya Grahanam 2025: 2025లో  తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవాళ  ఏర్పడనుంది. మరోవైపు తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ రోజు సంవత్సరంలో చివరి రోజైన అమావాస్య రోజున రాహు గ్రస్త సూర్య గ్రహణం ఏర్పడుతుంది. మన దేశంలో ఎక్కడా కనిపించని సూర్య గ్రహణం.. దీంతో నియమాలు పాటించాలా.. ? లేదా లాభా నష్టాల విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2025, 08:20 AM IST
Surya Grahanam: నేడు సూర్య గ్రహణం.. మన దేశంలో ఎక్కడా కనిపించని గ్రహణం.. లాభ నష్టాలు ఇవే..

Surya Grahanam 2025: క్రోధీ నామ సంవత్సరంలో చివరి మాసం చివరి రోజైన   పాల్గుణ అమావాస్య తిథి రోజుకు  సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో సంభవించే ఈ సూర్యగ్రహణం చాలా ప్రభావాలు చూపించే అవకాశం ఉందని ప్రముఖ పండితులు తెలుపుతున్నారు. ఈ ఏడాది హోలీ సందర్భంగా అంటే మార్చి 14న  కేతు గ్రస్త  చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నదని మాత్రమే కాదు... ఒకేసారి అనేక శుభ యోగాలు ఏర్పడతాయంటున్నారు పండితులు. మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి .. ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం .. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, మొరాకో, కెనడా, అమెరికా, పోర్చుగల్, బెర్ముడా, ఐర్లాండ్,ఐస్ లాండ్, నెదర్లాండ్స్, గ్రీన్ లాండ్, ఫారో దీవులు, జర్మనీ, నార్వే, డెన్మార్క్, స్వీడన్, రష్యా, హంగేరి, ఉక్రెయిన్, వెనుజులా, వాటికల్ సిటీలో కనిపిస్తోంది. ఇప్పటికే గ్రహణం ఎఫెక్ట్ తో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికో సొల్యూషన్ కూడా దొరకబోతుంది. ఉత్తరాబాధ్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్య గ్రహణం ఏర్పడటం చేత, ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు ముఖ్యంగా మీన, కన్య రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని తెలిపారు.

Add Zee News as a Preferred Source

జ్యోతిషశాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గుణ అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారము కూడా జరగబోతుంది.  జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. దీని వలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారిందంటున్న జ్యోతిష్య పండితులు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు.. సూర్యుడికి, మధ్య భూమి వచ్చినప్పుడు.. చంద్రుని వెనుక ఉన్న సూర్యుని నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు ఈ గ్రహణం భారత దేశ కాల మానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది. కనుక భారతదేశంలో కనిపించదు.
విదేశాలైన అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్న భారతీయులకు ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు కలిపించవచ్చు.ఈ సూర్య గ్రహణం ఏర్పడు పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ద వాతావరణం పెరగడం, ఆర్థికమాంద్యం కలగడం, ఉద్యోగస్థులకు, వ్యాపారస్థులకు ఇబ్బందితో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయంటున్నారు.
హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరూ ఏ పని చేయరు.  ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ టైంలో బెడ్​ దిగరు.. కాలు కదపరు.. ఇక బ్రాహ్మణులుతో పాటు పండితులు..  అనుష్ఠానం.. జపం చేసుకుంటారు. మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 2.21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం  గ్రహణం అయిన తరువాత దానధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. గ్రహణం సమయంలో జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు.  సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు జపాన్ని చేయించుకుంటే  తగ్గుతాయని చెబుతున్నారు.  అయితే మన దేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News