Hanuman Jayanti Lucky Zodiac Signs: ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేది వచ్చింది. అయితే ఇదే సమయంలో పంచగ్రహి యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, శని, రాహువు, సూర్య గ్రహాలు మీన రాశిలో కలయిక జరిపాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య యోగంతో పాటు మాళవీయ రాజయోగాలు ఏర్పడ్డాయి. అలాగే శుక్రాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగాలు కూడా ఈ సమయంలో ఏర్పడ్డాయి. దీని వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో నాలుగు రాశులవారికి విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టాన్ని ఆర్థికంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ శక్తివంతమైన యోగాల ప్రభావంతో ఏప్రిల్ 12వ తేది హనుమంతుడి అనుగ్రహం పొందబోతున్న రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభ రాశి:
హనుమాన్ జయంతి రోజు నుంచి వృషభ రాశివారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరు పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గతంలో చిక్కుకున్న డబ్బులు కూడా తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్ ఉంది.
మిథున రాశి:
హనుమాన్ జయంతి నుంచి మిథున రాశివారు కూడా విశేషమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు చేసేవారికి చాలా లాభసాటిగా ఉంటాయి. దీంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. ఇంట్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి భారీ మొత్తంలో జీతాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. దీంతో పాటు వ్యాపారాలు కూడా వృద్ధిలోకి వస్తాయి. అంతేకాకుండా ఇంట్లో సౌకర్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి.
కుంభ రాశి:
హనుమాన్ జయంతి నుంచి కుంభ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా పురోగతి కూడా లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. అలాగే అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. దీంతో పాటు ఆర్థికంగా చిన్న సమస్యలతో బాధపడేవారు అద్భుతమైన లాభాలు పొందుతారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









