)
Malavya Yoga Astrology Effect On Zodiac Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందులో శుక్రుడు లాంటి గ్రహానికి మరేంతో ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు ఎందుకంటే ఈ గ్రహం సాక్షాత్తు లక్ష్మీదేవి గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి లక్ష్మీదేవి వరాల జల్లు కురిపిస్తుంది. అలాంటిది నవంబర్ రెండవ తేదీన శుక్రుడు సొంత రాశి అయినా తులా రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన మాలవీయ రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం చాలా శక్తివంతమైంది గా భావిస్తారు. జాతకంలో ఈ యోగం ఏర్పడితే సంపాదన ఉన్నట్టుండి విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి.
ముఖ్యంగా మాలవీయ రాజయోగం వల్ల జీవితంలో సంపాదనతో పాటు అనేక శుభ ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరికి ఆకర్షణ కూడా పెరుగుతుంది. అలాగే ఆర్థిక శ్రేయస్సు లభించి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం ప్రారంభమవుతాయి. నవంబర్ మూడవ తేదీ నుంచి బృహస్పతి, శుక్రుడి మధ్య ఉండే బంధంతో మరో రాజయోగం కూడా ఏర్పడింది. ఈ రెండు రాజయోగాల ప్రభావం కొన్ని రాశుల వారికి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక పురోగతి తప్పకుండా లభిస్తుంది.
మీన రాశి
శుక్ర-గురు ఏర్పడిన కేంద్ర దృష్టి రాజయోగం ప్రభావంతో మీన రాశి వారికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి. అలాగే పూర్వీకుల ఆస్తుల నుంచి కూడా భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు వస్తాయి. అదృష్టం సహకరించి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఆదాయ వనరులు కూడా లభించి.. ఉన్నత శిఖరాలకు చేరుతారు. ముఖ్యంగా వీరికి కుటుంబ విషయంలో సామరస్యం కూడా పెరుగుతుంది..
మేషరాశి
మేషరాశి వారికి కూడా ఈ రాజయోగాల కారణంగా అదృష్టం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా బలపడబోతున్నారు. వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. అలాగే ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా కలిసి రాబోతోంది. ఇక అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కెరీర్ పరంగా పురోగతి కూడా లభించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులకు సపోర్టు లభించబోతోంది. దీని కారణంగా అనుకున్న పనులు వెంటవెంటనే చేసి కార్యాలయాల్లో అద్భుతమైన గుర్తింపు పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి కూడా రాజయోగాల ఎఫెక్ట్‌తో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి సమాజంలో గౌరవంతో పాటు సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది. కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. వీరికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. పదోన్నతులు కూడా లభించి జీతాలు కూడా పెంచుకోగలిగే అవకాశాలున్నాయి. ఇక కుటుంబంలో వస్తున్న అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు. దీనిని జీ న్యూస్ ధృవీకరించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook