TTD Big Update: తిరుమల స్వామి భక్తులకు బిగ్ అలర్ట్, బ్రేక్ దర్శనం రద్దు, దివ్య దర్శనం టోకెన్లు ప్రారంభం

TTD Big Update: తిరుమల స్వామి భక్తులకు బిగ్ అలర్ట్. వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని తట్టుకునేందుకు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2025, 01:20 PM IST
TTD Big Update: తిరుమల స్వామి భక్తులకు బిగ్ అలర్ట్, బ్రేక్ దర్శనం రద్దు, దివ్య దర్శనం టోకెన్లు ప్రారంభం

TTD Big Update: వేసవి కావడంతో తిరుమలలో రద్దీ పెరుగుతోంది. మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో రద్దీ మరింతగా పెరగనుంది. ఈ క్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు చర్యలు తీసుకుంంది. బ్రేక్ దర్శనం లేఖల్ని రద్దు చేసి దివ్య దర్శనం టోకెన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 

Add Zee News as a Preferred Source

తిరుమల స్వామివారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే రావల్సి ఉంటుందని టీటీడీ ఈవో స్పష్టం చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్న ప్రసాదాలు ఎలాంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూలైన్లలో ఉండే భక్తుల కోసం కొత్తగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వాహనాల ద్వారా భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు అందించనున్నారు. ఇక సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వ దర్శనం స్లాట్ టోకెన్లు ఉన్నవారికి  క్రమపద్ధతిలో దర్శనాలు కల్పించనున్నారు. 

తిరుమల స్వామిని దర్శించుకునేందుకు అలిపిరి నడక మార్గంలో రోజుకు 8-15 వేల మంది వస్తుంటారు. దీనికోసం నడక మార్గంలో వచ్చేవారికి 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చేవారికి 6 వేల చొప్పున రోజుకు 20 వేల దివ్య దర్శనం టోకెన్లు అందించేవారు. ఈ టోకెన్లు కలిగినవారికి వైకుంఠం క్యూలైన్లలో ప్రత్యేక ప్రవేశ దర్శనం తరువాత అవకాశం ఉండేది. ఇప్పుడు రద్దీగా ఉండటంతో గతంలో ఇచ్చినట్టే రెండు మార్గాల్లోనూ దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వాలని టీటీడీ ఆలోచిస్తోంది. కరోనా సమయంలో ఈ టోకెన్‌లను నిలిపివేశారు. ఆ తరువాత చిరుత దాడి అలజడి నేపధ్యంలో ప్రారంభించలేదు. 

మరో వైపు వేసవి రద్దీ ముగిసేవరకూ భక్తులకు ముఖ్యంగా సామాన్యులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనం లేఖల్ని రద్దు చేసే ఆలోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. 

Also read: TS Inter Results 2025: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News