Tirumala Darshan Time: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు, ఏ దర్శనానికి ఎంత సమయం

Tirumala Darshan Time: వేసవి ప్రభావం తిరుమలపై స్పష్టంగా కన్పిస్తోంది. సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయటి వరకూ కన్పిస్తున్నాయి. ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఓసారి పరిశీలిద్దాం.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2025, 09:17 AM IST
Tirumala Darshan Time: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు, ఏ దర్శనానికి ఎంత సమయం

Tirumala Darshan Time: తిరుమల స్వామి దర్శనం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. దాదాపు 15-20 రోజుల్నించి తిరుమలలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. భక్తులతో తిరుమల ప్రాంగణం కిటకిటలాడుతోంది. 

Add Zee News as a Preferred Source

తిరుమలలో రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. రోజుకు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దాదాపు 20 రోజుల్నించి ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వేసవి సెలవులు ముగుస్తుండటం ఓ కారణమైతే, పెళ్లిళ్లు, శుభకార్యాలు పూర్తి చేసుకుని ముక్కులు చెల్లించుకునేవారు, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఇలా వివిధ కారణాలతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయటి వరకూ కన్పిస్తున్నాయి. దీనికితోడు సిఫారసు లేఖలు కూడా అనుమతిస్తుండటంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. 

భక్తులు పోటెత్తడంతో వసతి గృహాలు దొరకడం కష్టమైంది. ఎవరికీ ఒకరోజుకు మించి వసతి కేటాయించడం లేదు. ఇక లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద భారీ క్యూలు కన్పిస్తున్నాయి. తలనీలాల ప్రాంతంలో కూడా భక్తుల నిరీక్షణ కన్పిస్తోంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. 

ఏ దర్శనానికి ఎంత సమయం

తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్ 31 కంపార్ట్‌మెంట్లలో కూడా భారీగా భక్తులు నిరీక్షిస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లో ఉదయం 7 గంటలకు ప్రవేశిస్తే శ్రీవారి దర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం అయితే 5 గంటలు పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతోంది. 

Also read: IPL 2025: పంజాబ్ ఎందుకు ఓడిపోయింది, ఇవే కారణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News