Tirumala special Darshan quota released: తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్‌ ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రూ. 300 టక్కెట్లను టీటీడీ యంత్రాంగం విడుదల చేసింది. వీటిని టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. గత నెలలో జూలై నెల స్పెషల్‌ ఎంట్రీ టిక్కెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల శ్రావణ మాసం కావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. శుక్రవారం మే 24న ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ యంత్రాగం విడుదల చేసింది. అంతేకాదు గురువారం రోజు శ్రీవాణి, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక కోటాను కూడా విడుదల చేసింది. మరుసటిరోజు అంటే శనివారం వసతి గదుల కోటాను కూడా విడుదల చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 www.Tirumalatirupatidevasthanam వేదికగా ఈ కోటాను విడుదల చేసింది. అయితే, ఈ నెల 27న కూడా పరకామణి సేవ, నవనీత సేవను కూడా టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఇవి కాకుండా నేరుగా వెళ్లాలనుకున్న భక్తులకు సర్వ దర్శనం టిక్కెట్లను కూడా ఇస్తారు. దీనికి ఆధార్‌ కార్డు వంటివి తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలి. 12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు ఏ టిక్కెట్టు అవసరం లేకుండా నేరుగా స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు.


ఇదీ చదవండి: ఘనంగా ముగిసిన గంగమ్మ జాతర.. వివిధ వేషాలతో తిరుపతి ప్రజల సందడి


ఆగస్టు నెల అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల కూడా టిక్కెట్ల బుకింగ్‌ ఎక్కువ అవ్వడంతో సర్వర్‌ డౌన్‌ సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన మాసంలో వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకోవాలని ప్రతి శ్రీవారి భక్తుడు కోరుకుంటాడు.  ప్రతినెల టీటీడీ మూడు నెలలకు ముందుగానే శ్రీ వారి దర్శనానికి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈరోజు ఉదయం 10 గంటల నుంచే అందుబాటులో ఉంచింది. కొద్ది సేపటికే అతి త్వరగా ఈ టిక్కెట్ల బుకింగ్‌ కూడా జరుగుతుంది. ఈ ప్రత్యేక మాసంలో భక్తులు శ్రీవారి దర్శనానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ఆగస్టు నెలలో వరుసగా 15 ఏకాదశి గురువారం, 16 శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా ఉంది.  ఆ తర్వాత శనివారం, ఆదివారం కూడా రావడంతో భక్తులు ఈ సమయంలో శ్రీవారిని పద్మావతి అమ్మవార్ల దర్శనానికి రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.


ఇదీ చదవండి: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter