Tirumala Accommodation: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో గదుల్ని ఇంట్లో కూర్చుని సులభంగా ఎప్పటికప్పుడు కరెంట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రక్రియ భక్తులకు మరింత సౌకర్యంగా ఉండనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యం, వెసులుబాటు కోసం ఎప్పటికప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ కొత్త విధానాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేసింది. మరోవైపు వీటిని పరిమితం చేసేందుకు ఆలోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్త విధానం లేదా కొత్త ప్రక్రియ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక తిరుమలలోని వివిధ వసతి గృహాల్లో బుకింగ్ విషయంలో కొత్త పద్ధతి తీసుకొస్తోంది. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు తీసుకొచ్చినవారికి ఎన్‌రోల్‌మెంట్ స్లిప్స్ పైనే గదుల కేటాయింపు జరిగే విధానం ప్రారంభించారు. ఇప్పటి వరకూ సిఫారసు చేసినవారి ధృవపత్రాలతో పాటు జిరాక్స్ తీసుకొచ్చి ఈవో కార్యాలయంలో సమర్పిస్తే గదులు కేటాయిస్తూ స్టాంపింగ్ చేసేవారు. అయితే ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. దాంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగేది.
కానీ ఇకపై ఎన్‌రోల్‌మెంట్ స్లిప్స్ ఆధారంగానే గదుల కేటాయింపు జరగనుంది. ఈ స్లిప్స్ సంబంధిత కేంద్రాల్లో స్కానింగ్ చేస్తే చాలు గదులు కేటాయిస్తారు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రామ్ బగీచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణ గిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత, సప్తగిరి వసతి గృహాలు ఉన్నాయి. తిరుమలకు నిత్యం వచ్చే భక్తుల కోసం మొత్తం 7500 గదులు అందుబాటులో ఉన్నాయి.
అయితే సుదర్శన్‌లో 389, గోవర్ధన్‌లో 196, కళ్యాణ్ సత్రంలో 246 గదుల్లో వాటర్ లీకేజ్, ఇతర మరమ్మత్తు సమస్యలున్నాయని గుర్తించారు. వీటిని తక్షణం మరమ్మత్తు చేయించేందుకు టీటీడీ నిర్ణయించింది. తిరుమలలోని గదుల్లో 3500 గదుల్ని సామాన్య భక్తుల కోసం సీఆర్వో పరిధిలో ఆధార్ కార్డు ద్వారా కరెంట్ బుకింగ్‌తో అందిస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్‌తో మరో 1580 గదులు కేటాయిస్తున్నారు.
Also read: Telangana SSC Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు , ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









