TTD Rules: వేసవి కావడంతో తిరుమలలో రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. రద్దీ సందర్భంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ తొలగేవరకు సిఫార్సు లేఖలకు చెక్ చెప్పాలని నిర్ణయించింది. ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
టీటీడీలో సంస్కరణలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం వరుసగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు దర్శనం త్వరగా కల్పించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ విదానంలో టోకెన్లు మంజూరు చేయడమే కాకుండా కేవలం అరగంట వ్యవధిలో దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆఫ్‌లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం కల్పించనుంది. కోవిడ్ కంటే ముందు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, శారీరక-మానసిక వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన భక్తులకు రోజుకు 1400 మందికి దర్శనం ఉండేది. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం కౌంటర్ ద్వారా ఉదయం 10 గంటల స్లాట్‌లో 700, మద్యాహ్నం 3 గంటల స్లాట్‌లో 700 మందికి టోకెన్లు జారీ చేసేవారు. కోవిడ్ సమయంలో దీనిని తొలగించి ఆ తరువాత మళ్లీ పునరుద్దరించింది.
ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల తరహాలో బుకింగ్ నడుస్తోంది. మద్యాహ్నం 3 గంటల స్లాట్‌లో కేవలం 1000 టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకుండా దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి ఆఫ్‌లైన్ టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయించింది టీటీడీ. ప్రస్తుతం వచ్చే మూడు నెలలకు సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ టోకెన్లు పూర్తయ్యాయి. ఇక ఆఫ్‌లైన్ విధానంలో ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలనే నిబంధనలు ఇంకా ఖరారు కావల్సి ఉన్నాయి.
మరో వైపు బ్రేక్ దర్శనాల్లో కూడా మార్పులు చేశారు. రాత్రి వేళ కంపార్ట్‌మెంటుల్లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం చేయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10.30 గంటలకు మార్చారు. కానీ అభ్యంతరాలు ఎదురవడంతో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని తిరిగి ఉదయం 5.30 గంటలకే మార్చారు. ఇక వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫారసు లేఖల్ని ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు రద్దు చేయనున్నారు.
Also read: Hardik vs Jasmin: ఆ ఇద్దరి ఎఫైర్ నిజమే, ముంబై ఇండియన్స్ బస్సులో హల్‌చల్ చేసిన జాస్మిన్ వాలియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









