TTD VIP Break Darshan: తిరుమల శ్రీవారిని నేరుగా దర్శించుకునే గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది టీటీడీ. సనాతనంపై యువతకు ఆసక్తి, అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. స్వామివారిని నేరుగా దర్శించుకోవచ్చు.
యువతకు సనాతన హిందూ ధర్మంపై అవగాహన, అనురక్తి కల్పించేందుకు టీటీడీ నూతన కార్యక్రమం రూపొందించింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు నేరుగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. 25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగినవారు అర్హులు. 1 కోటి 1 వేయి 116 సార్లు గోవిందనామాలు రాయాల్సి ఉంటుంది. ఇలా రాసినవాళ్లు కుటుంబంతో సహా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు.
గోవింద నామాలతో గోవింద కోటి రాసేందుకు అవసరమైన పుస్తకాలు టీటీడీ సమాచార కేంద్రాల్లో, బుక్ స్టాల్స్‌లో, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కోటి నామాలు పూర్తి చేసేందుకు కనీసం మూడేళ్ల సమయం పడుతుందని అంచనా. ఒక్కో పుస్తకం 200 పేజీలతో 26 పుస్తకాలు అవసరమౌతాయి. తిరుమలలో ఉన్న టీటీడీ పేష్కార్ ఆఫీసులో ఈ పుస్తకాలు అందిస్తే ఆ తరువాతి రోజే వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. యువతలో ఆధ్యాత్మిక చింతన పెంచే క్రమంలో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రోత్సహిస్తోంది.
Also read: TTD Darshan: తిరుమలలో తగ్గిన రద్దీ, మిగిలిపోతున్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, కారణం అదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి