TTD Updates: శ్రీవారి భక్తులకు శుభవార్త, ఇకపై ఏఐ సేవలు

TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త. భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీటీడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటుల తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2025, 02:47 PM IST
TTD Updates: శ్రీవారి భక్తులకు శుభవార్త, ఇకపై ఏఐ సేవలు

TTD Updates: టీటీడీ ఇప్పుడు ఆర్జిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు తీసుకొస్తోంది. స్వామి భక్తులకు మరింత వేగవంతమైన దర్శనం, వసతి కల్పించేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించనుంది. ఇకపై ప్రతి కంపార్ట్‌మెంట్ వద్ద ఆర్టిఫిషియల ఇంటెలిజెన్స్ కెమేరాలు ఏర్పాటు కానున్నాయి. 

Add Zee News as a Preferred Source

రానున్న రోజుల్లో టీటీడీ మరింత మెరుగైన సౌకర్యాలు అందించనుంది. ప్రతి భక్తుడికి పర్మనెంట్ ఐడీ అందించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఫేషియల్ రికగ్నిషన్ ముఖ చిత్రాల్ని నమోదు చేస్తోంది. తిరుమలలో ఇకపై అన్ని రకాల సేవలు టెక్నాలజీ ఆధారంగా ఉండనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉయోగించుకుని సేవలు వినియోగించుకోనుంది. భక్తులకు శాశ్వతమైన ఐడీ,వసతి అందించేందుకు టెక్నాలజీ ఉపయోగించనుంది. భక్తుల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కొత్త సేవలు అందిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఇప్పటికే గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసి అందుకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయనున్నారు. ఏ సమయంలో, ఎప్పుడు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని టీటీడీకు అందిస్తారు భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయనుంది. దర్శనం విధి విధానాలు, వస్త్ర ధారణ, అనుసరించాల్సిన నియమాల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వివరాలు తెలుసుకోవచ్చు. దేశ విదేశాల్నించి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం వారికి కావల్సిన భాషల్లో సమాచారం అందనుంది. 

ఏఐ కెమేరాలను తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది. తద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే చాలా సులభంగా గుర్తించవచ్చు. ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ నెంబర్ కేటాయిస్తారు. భవిష్యత్తులో కూడా దర్శనం, సేవలు, వసతి గదులకు అదే ఐడీ ఉపయోగిస్తారు. అంటే ఎవరు ఎన్ని సార్లు దర్శనం చేసుకున్నారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం లభ్యమౌతుంది. 

Also read: Southwest Monsoon: నైరుతి రుతు పవనాలు వచ్చేశాయి, గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News