)
Mahalaya Amavasya: భాద్రపద మాసంలో మహాలయ పక్షం ప్రారంభమైన విషయం తెలిసిందే. బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో ఊర్ధ్య లోకాలలో ఉన్న పిత్రుదేవతల ఆత్మలు, అధో లోకాలలో ఉన్న ఆత్మలు భూమిపైకి వచ్చి ఇక్కడి వాతావరణంలో సంచరిస్తుంటాయని... తమ వంశీకుల నివాసాల వద్ద గాలి రూపంలో ఉంటాయని హిందూవుల విశ్వాసం. మహాలక్ష పక్షంలో అతి ముఖ్యమైనది మహాలయ అమావాస్య. రేపు ఆదివారం మహాలయ అమావాస్య రావడంతో ఈ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య రోజు చెప్పుకోవలసిన ప్రత్యేక సంకల్పం ఒకటి ఉంది. ఇది కుటుంబ సభ్యులందరూ కలిసి చెప్పుకోవలసిన పవిత్ర వచనం. మీ గోత్రం… మీ పేరు చెప్పి ఈ కింది సంకల్పం చెప్పండి..
నా జన్మకు మూలమైన తల్లిదండ్రులకు నా అనంతకోటి నమస్కారం.
వారి మూలమైన తాతలకూ, ముత్తాతలకూ నా అనంత ప్రణామాలు
సృష్టి ఆరంభం నుంచి ఈ వంశపరంపరలో పుట్టిన పూర్వీకులందరికీ నా కోటి వందనాలు
'మీలోని యోగులు, మహాత్ములు, పుణ్యాత్ముల సంస్కారబలం నాలో ప్రవేశించి, నాకు జ్ఞానం, జీవన ధన్యం ఇచ్చినందుకు కృతజ్ఞుడిని. ఈ వంశంలో పుట్టినందుకు గర్విస్తున్నా. మీ సద్గుణాలు నాలో కలసి, లోకహితకార్యాలు చేయుటకు శక్తి ప్రసాదించండి. ఈ వంశ కీర్తి, ప్రతిష్టలు సూర్యచంద్రులవలె శాశ్వతంగా నిలవాలని దీవించండి' అని ప్రార్థించాలి.
'మా లోపాలను తొలగించి, క్షేమం, స్థైర్యం, ధైర్యం, విజయం, అభయం, ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించి.. ధర్మ, అర్ధ, కామ, మోక్షములను అనుగ్రహించి, అహంకారరహిత స్థితి కలిగించండి' అని పితృ దేవతలను కుటుంబసభ్యులు ప్రార్థన చేయాలి.
'అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సమస్త సద్గురువులు, దేవతామూర్తులందరి ఆశీస్సులను కోరుకుంటూ… ఈ మహాలయ అమావాస్య రోజున త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి మా పూర్వీకులందరికీ నమస్కరిస్తున్నా' అని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook