Maha Shivratri Secrets: సృష్టికి మూలం శంకరుడు అని అంటారు. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక అతి పవిత్రమైన దినం. ఈ రోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు కావడంతో మహా శివరాత్రిగా పిలుస్తారు. మహా శివరాత్రి పరమశివుడు తాండవం చేసే రోజు. మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అత్యంత భక్తిప్రపత్తులతో శివుడిని పూజిస్తే కలిగే పుణ్యం.. పొందే తన్మయత్వం అనిర్వచనీయం. మహా శివరాత్రి సందర్భంగా కొన్ని రహాస్యాలు తెలుసుకుందాం.
Also Read: Maha Shivaratri 2025: ఏ పేరుతో పిలిచినా పలికే ప్రతక్ష్య దైవం శివుడు.. ఈ పేర్లతో పిలవవచ్చు
- శివుడిని ఆదిదేవుడిగా పేర్కొంటారు. శివుడికి ఎలా పూజ చేసినా అందుకుంటాడు. శివుడికి ప్రత్యేకంగా పూజా విధానం అంటూ ఏమి లేదు. నమస్కరించినా.. శివ నామస్మరణ చేసినా కూడా చాలు శివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతారు.
- శివుడిని ఎంతో భక్తితో.. తన్మయత్వంతో పూజించాలి. భక్తిప్రపత్తులతో శివుడికి నీళ్లతో అభిషేకం చేస్తే చాలు. పరమేశ్వరుడిని పూజించడం చాలా పుణ్యం కలుగుతుంది.
- ఓం నమఃశివాయ అంటూ శివుడికి పూజలు చేశారు. శివుడిని పూజించడం కోసం చన్నీళ్లతో చేయాలి. తలస్నానం చేసి తక్కువ వస్త్రాలతో శివుడిని పూజించాలి.
- పరమాత్ముని నామం సదా శివ. దీని అర్థం ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి ", "శుభకారి" అని ఉంటుంది.
- పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్యమూర్తి శివుడికి స్థూల, సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.
- పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.
- పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా సృష్టించినవాడు అని అర్థం.
- పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుడి ద్వారా మహావినాశనము. ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్ముడు.
- లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని, లక్షణములు చూపించేది అని అర్థం. పరమాత్మ లక్షణాలు చూపించేది కావడంతో శివలింగం అని అంటారు .
- పరమశివుడిని తలచుకోవాలనుకుంటే ఓం నమః శివాయ అని అంటారు. ఈ పంచాక్షరి మంత్రం శివుడి అనుగ్రహం పొందుతారు. ఓం నమఃశివాయ అర్థం ఏమిటో తెలుసా? ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని ఓం నమఃశివాయ అర్ధం.
ఓం - నేను ఆత్మను
నమః - నమస్కారం
శివాయ -పరమాత్ముడు
Also Read: Maha Shivratri 2025: మహా శివుడిని బిల్వ పత్రాలతోనే ఎందుకు పూజిస్తారు.. నియమాలు.. ఫలితాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









