Sri Vishwavasu Ugadi 2025: ఉగాది పండగ నేపథ్యం.. పురాణ ప్రాశస్త్యం ఇదే.. శ్రీ విశ్వావసు అంటే ఏమిటి..!

Sri Vishwavasu Ugadi 2025: ఉగాది అంటే మన తెలుగు వారు జరుపుకునే పండగల్లో తొలి పండగ అని చెప్పాలి. యుగానికి ఆది రోజు కాబట్టి యుగాది అయింది. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతోంది. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంతం మొదలవుతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2025, 12:43 PM IST
Sri Vishwavasu Ugadi 2025: ఉగాది పండగ నేపథ్యం.. పురాణ ప్రాశస్త్యం ఇదే.. శ్రీ విశ్వావసు అంటే ఏమిటి..!

Sri Vishwavasu Ugadi 2025: ఉగాది రోజు నుంచే కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ ఉగాది. ఈ సారి తెలుగు సంవత్సరాదిలో 39వ అయిన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఉగాది  రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. సంప్రదాయాలు, సదాచారాలతో పాటూ ఆరోగ్య సూక్తులూ, మానవ జీవన విలువలూ మేళవించిన అపూర్వ సమ్మేళనాలు పండుగలు. తెలుగువారికి ఇష్టమైన పండుగ ఉగాది. కోయిల పాటే ఉగాది. చెట్ల చిగురే ఉగాది. షడ్రుచుల సమ్మేళనపు జీవితపు పరిమళమే ఉగాది. వసంతాగమన వేళ జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది.శిశిరంలో ఆకురాల్చిన ప్రకృతి.. వసంతంలోకి లేత ఆకుపచ్చగా.. కొత్త చిగుళ్లు వేసి నవ యవ్వనంలా కనిపిస్తుంది. కొత్త పూల నుంచి వీచే పిల్ల గాలికి పక్షులు కిలకిలరావాలతో గిలిగింతలు పెడతాయి. ఓటమివెంటే గెలుపు ఉంటుందని... చీకటివెంటే వెలుగు ఉంటుందని...నమ్మకాన్ని వీడద్దని చెప్పే పండుగ ఉగాది.ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అంటే విశ్వానికి సంబంధించినది.. ధనసమృద్దిని కలిగించేది.

Add Zee News as a Preferred Source

ప్రకృతి మొత్తం లే చివుళ్లతో, రంగురంగుల పూలతో ముస్తాబై ఆహ్వానం పలికే పండుగ ఉగాది. మత్త కోయిలల కుహూగానాలతో ఉగాదికి కొత్త సోయగాలు తీసుకువస్తాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టి ఆరంభించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు మత్యావతారంలో సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునుండే ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.

అంతేకాదు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది కావడం విశేషం. ఈ రోజు నుండే శాలివాహన శకం ప్రారంభమైందని చెబుతారు. ఉగాదిలోని యుగం అంటే ద్వయం, జంట అని కూడా అర్థం ఉంది. ఉత్తరాయన, దక్షిణాయన అను ద్వయాలు కలిస్తేనే యుగం.. సంవత్సరం అవుతుంది. దీనికి ఆది యుగాది. హైందవశాస్త్రం ప్రకారం తెలుగు నామ సంవత్సరాలు అరవై. అవి ప్రతియేడు ఒక క్రమంలో వస్తాయి. ఈ సారి శ్రీ విశ్వావసు తెలుగు సంవత్సరాల్లో 39వది.

ఉగాది రోజు సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. బీడుపడిన భూములు మొలకలెత్తి ప్రకృతి పచ్చగా మారుతుంది. పచ్చని పంటపొలాలు, వాటిపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నలుగా కనువిందు చేస్తాయి. వీటన్నింటితో పాటూ ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. ఉగాది రోజున కుటుంబ సభ్యులందరూ.. సూర్యోదయం ముందే లేచి కాలకృత్యాదులు ముగించుకొని సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని.. శీకాయపొడితో అభ్యంగన స్నానమాచరించాలనేది శాస్త్ర వచనం.

అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్ఠాదేవి నిష్క్రమించి.. లక్ష్మీదేవిని ఆహ్వానం పలకడమే దీని ఉద్దేశ్యం. సంవత్సరాది నుంచి ప్రాత: కాల ఉదయపు పూజ తర్వాత.. ‘ఉగాది పచ్చడి’ని నైవేద్యంగా స్వీకరించాలి. పంచాగం అంటే.. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము.. ఈ ఐదు కలిపి పంచాంగం అంటారు. ఈ రోజు తిథి దేవత, నక్షత్ర దేవత, వార దేవత, మాస దేవత, సంవత్సర దేవత, నవగ్రహ దేవతల అనుగ్రహం పొందడానికి ఏకైక మార్గం. ఈ రోజు పండితులను నూతన వస్త్రాలతో సత్కరించుట మహా పుణ్య ప్రదమని శాస్త్ర వచనము. ఇలా చేస్తే ఆ యేడాది నవగ్రహ పీడలు తొలిగుతాయనేది ప్రతీతి.

ఈ రోజు ఇంటిపై కాషాయ ధ్వజాన్ని అర్చించి ఇంటి ఆవరణలో ఎగరవేసినట్టైయితే.. ఆ గృహానికి సంపూర్ణ రక్ష. అంతేకాదు ఈ రోజు కొత్త కూష్మాండము (గుమ్మడికాయ) పూజ చేసి.. ఇంటి ముంగిట కుష్మాండ ధారణ చేయడం వలన గృహ, వాస్తు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News