Viswavasu Nama Samvatsaram 2025: ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి, యుద్ధాలు, రోగాల భయం తప్పదా

Viswavasu Nama Samvatsaram 2025: ఈరోజు ఉగాది కొత్త సంవత్సరం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరమిది. ఈ ఏడాది ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణం వచ్చేసింది. సూర్యుడు అధిపతిగా ఉన్న ఈ ఏడాదిలో జరగనున్న పరిణామాలు ఇలా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 30, 2025, 12:58 PM IST
Viswavasu Nama Samvatsaram 2025: ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి, యుద్ధాలు, రోగాల భయం తప్పదా

Viswavasu Nama Samvatsaram 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన పంచాంగం వచ్చేసింది. ఈ ఏడాది ప్రజలకు ఎలా ఉండబోతోంది. ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు, సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందనేది పంచాంగ కర్తలు వివరించారు. ప్రభవ నుంచి మొదలయ్యే 60 సంవత్సరాల తెలుగు క్యాలెండర్‌లో ఇది 39వ సంవత్సరం. 

Add Zee News as a Preferred Source

పంచాంగం ప్రకారం ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం మార్చ్ 30 కావడంతో అధిపతిగా సూర్యుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది కాలంలో మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం కన్పిస్తుంది, యుద్ధభయాలు ఉన్నాయా లేవా, ఆదాయ వ్యయాలు, కష్ట సుఖాలు ఎలా ఉంటాయి, వర్షాలు సమృద్ధిగా ఉంటాయా అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతి ఒక్కరూ ఈ వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాదికి అధిపతిగా సూర్యుడు ఉండటంతో వర్షాలు సాధారణంగానే ఉంటాయని పండితులు అంచనా వేస్తున్నారు. పంటలు బాగానే పండి కరవు కాటకాలు ఏర్పడవంటున్నారు. 

చంద్రుని స్థితి, కదలిక ఆధారంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో భవ కరణం ఉంటుందని అంటున్నారు. అంటే వ్యాధి నాశనం, ఇష్టకామ్యం సిద్ధించనున్నాయి. పెళ్లి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ఏడాది వివాహ యోగం ఉంటుంది. వివిధ రంగాల్లో ఉన్నవారికి విజయం లభిస్తుందంటున్నారు. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త వ్యాధుల భయం పొంచి ఉంది. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది దొంగతనాలు భారీగా జరగవచ్చు. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

ఈ ఏడాది ఉగాది రేవతి నక్షత్రంలో ప్రారంభమౌతుంది. ఫలితంగా చాలామందిపై ఇంద్రయోగం ఉంటుందంటున్నారు పండితులు. ఇంద్రయోగం అనేది శుభానికి సూచకం. ఈ ఏడాది రాష్ట్రానికి దేశానికి చాలా లాభదాయకం. ప్రజలు అనుకొన్నవి నెరవేరనున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతో దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. డబ్బు లోటు ఉండదు. ఇక ఇతర ప్రతిబంధకాలు, సమస్యల నుంచి బయటపడేందుకు నిత్యం పారాయణం చేయడం, సూర్యారాధన చాలా అవసరమంటున్నారు జ్యోతిష్య పండితులు. దాదాపుగా అన్నింటా శుభంగా ఉండే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అందరి జీవితాల్లో ఆనందం నింపాలి కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు

Also read: Ugadi 2025: ఈ ఏడాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోండి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News