
Ugadi 2025: 60 ఏళ్ల క్రమంలో ఈ ఏడాది 39వ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భం. ప్రతి యేటా ఉగాది నాడు చేసే అతి ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం వినడం. ఈ ఏడాది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఉగాది అంటే తెలుగు యుగాదికి మొదటి రోజు. వివిధ రాశులవారికి ఈ ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకునేదే పంచాంగ శ్రవణం. ఉగాది నాడు జరిగే అతి ముఖ్యమైన ప్రక్రియ ఇది. ఉగాది పంచాంగాన్ని పండితులు విడుదల చేస్తుంటారు. ఎవరెవరి గ్రహ పరిస్థితులు, నక్షత్ర, రాశుల స్థితిని బట్టి ఈ కొత్త ఏడాది ఎవరికి ఎలా ఉంటుందో చెబుతుంటారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా నష్టం జరుగుతున్నట్టు ఉంటే పరిహారకాలతో వాటిని సరి చేసేందుకు ఉంటుంది. అందుకే పంచాంగ శ్రవణం వింటుంటారు.
ఈ ఏడాది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం, ఖర్చు వివరాలు ఎలా ఉంటాయో కూడా పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తుంటుంది. వివిధ గ్రహాల స్థితిగతుల్ని బట్టి అంచనా వేసి చెబుతుంటారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఎప్పుడు మంచి రోజు ఉంది, ఎప్పుడు మంచిది కాదనేది తెలుస్తుంది. పెళ్లిళ్ల సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మంచిది కాదనేది ఉగాది నాడే నిర్ణయిస్తుంటారు.
ఈ కొత్త ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆనందంతో ఉంటారని తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది శాంతి ఉంటుంది. ఇక సంపద సృష్టి లేదా కలిసిరావడం సమృద్ధిగా ఉంటుంది. ఉగాది ఈసారి రేవతి నక్షత్రంలో ప్రారంభం కానుండటంతో మార్గశిర మాసంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఉగాది నాడు ఏం చేయకూడదు
ఉగాది రోజున ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు. ఇవాళ్టి రోజున మాంసాహారం, మద్యం, ధూమపానంకు దూరంగా ఉండాలి. చెరిగిన లేదా మాసిన బట్టలు ధరించకూడదు. ఉన్నంతలో కొత్త బట్టలు ధరించాలి. మరీ ముఖ్యంగా దక్షిణ దిశగా కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. స్నానం చేసిన తరువాత దేవుని గది శుభ్రపర్చుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి