Goddess Yami Story: యముడికి ఎంతో ఇష్టమైన చెల్లి ఎవరో మీకు తెలుసా?

Story Of Goddess Yami: హిందూ పురాణాలలో అనేకమంది దేవతలు ఉన్నారు, అయితే కాలక్రమేణా కొంతమంది దేవతల ప్రాముఖ్యత తగ్గింది. మరుగునపడిన దేవతలలో యమి ఒకరు. యమి దేవత గురించి, ఆమె ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 31, 2025, 02:12 PM IST
Goddess Yami Story: యముడికి ఎంతో ఇష్టమైన చెల్లి ఎవరో మీకు తెలుసా?

Story Of Goddess Yami: హిందూ పురాణాలలో దేవతలు, దేవతల సంఖ్య చాలా విస్తారమైనది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శక్తులు, విధులు ఉన్నాయి. అయితే కాలక్రమేణా కొంతమంది దేవతల ప్రాముఖ్యత తగ్గింది. వారి పేర్లు, కథలు చాలామందికి తెలియకుండా పోయాయి. అలాంటి కొన్ని పేర్లు మరుగైన దేవతలో ఒకరు యమి దేవత. ఇంతకు యమి దేత ఎవరు? ఎందుకు ఆ దేవత ప్రస్థానం ఎక్కడ లేదు అనే విషయాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

యమ, యమి జననం:

పురాణాల ప్రకారం, యమి, యముడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞ (సూర్యుని భార్య) ద్వారా జన్మించారు. అయితే సూర్యుని వేడిని భరించలేక సంజ్ఞ కళ్ళు ముసుకుంటుంది. దీంతో సూర్యడు కోపంతో శాపం పెడుతాడు. సంజ్ఙకు పుట్టే పిల్లలు చంచలమైనవారిగా, జీవుల జీవితాలకు కారణమైనవారిగా ఉంటారిని శపిస్తాడు. వారే యమ, యమి.

యమ, యమి: 

యముడు మృత్యుదేవత. అతడు మరణించిన వారి ఆత్మలను తీసుకెళ్లి యమలోకంలోకి ప్రవేశపెడతాడు. అతను ధర్మరాజుగా కూడా పిలువబడతాడు, ఎందుకంటే అతను ప్రతి ఒక్కరి కర్మలను బట్టి న్యాయం తీరుస్తాడు.  యముడి వాహనం దున్నపోతు. యముడు చేతిలో కాలదండం, పాశం ఉంటాయి. అలాగే యముడి వద్ద చిత్రగుప్తుడు అనే సహాయకుడు ఉంటాడు. ఇతను మనుషుల మంచి చెడు పనుల లెక్కలను రాస్తుంటాడు. పురాణాలలో యముడి గురించి అనేక కథలు ఉన్నాయి. కఠోపనిషత్తులో నచికేతుడికి యముడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు.

హిందూ పురాణాల ప్రకారం యమి దేవత సూర్యుని కుమార్తె, యముని కవల సోదరి. ఆమె మరణానికి దేవతగా పరిగణించబడతారు. యమునితో కలిసి మరణించిన వారి ఆత్మలను స్వర్గానికి లేదా నరకానికి మార్గనిర్దేశం చేస్తుంది. కొన్ని గ్రంథాలలో, యమిని యమున నది దేవతగా కూడా భావిస్తారు. 

కొన్ని పురాణాలలో, యమి యముడితో సంబంధం పెట్టుకోవాలని కోరింది, కానీ యముడు ఆమెను సోదరిగా భావించి దానిని నిరాకరించాడు. దీనిని బట్టి వారిద్దరి మధ్య అనుబంధం తెలుస్తుంది.  యమ, యమిల మధ్య ఉన్న అనుబంధం చాలా పవిత్రమైనది. ఇది సోదరీ, సోదరుల మధ్య ఉండవలసిన స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తుంది. వేదాలలో పురాణాలలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు వారి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తాయి. 

యమున నది విశిష్థత: 

యమిని యమున నది దేవతగా కూడా పూజిస్తారు, ఇది హిందువులకు పవిత్రమైన నది. యమునా నది భారతదేశంలో గంగానదికి అతిపెద్ద ఉపనది. ఇది హిమాలయ పర్వతశ్రేణులలోని యమునోత్రి వద్ద జన్మించి, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ వద్ద గంగానదిలో కలుస్తుంది.  ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. దీని ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గంగా యమునా సరస్వతి నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం ఇది అలహాబాద్ లో ఉంది.
 

ALSO READ: Hibiscus Tea Benefits For Women: మందార పూల టీ తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్‌ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News