Venus Transit In Pisces Effect On Zodiac: ప్రతి గ్రహం తప్పకుండా ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశిస్తుంది. సాధారణంగా కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశి సంచారం చేసినప్పుడు ఎంతో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్ర గ్రహం లాంటి ప్రత్యేకమైన పాముఖ్యత కలిగిన గ్రహాలు సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ శుక్రుడు ఏ రాశిలోనైనా 25 రోజుల పాటు సంచార దశలో ఉంటుంది. శుక్రుడు ఏప్రిల్ 13వ తేదిన మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మే 31వ తేది వరకు శుక్రుడు మీన రాశిలో ఉండి.. ఆ తర్వాత మేష రాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఉద్యోగం, వ్యాపారాలపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడిని లక్ష్మీదేవికి కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే, సంపద, శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు.. ఇది వైవాహిక జీవితం పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.
మీన రాశి
ముఖ్యంగా మీన రాశివారికి జీవితంలో ఈ సమయం నుంచి వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తగ్గిపోయి.. ప్రేమ పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. దీంతో పాటు వీరికి వివాహాలు కూడా ఈ సమయంలో జరిగిపోతాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
కర్కాటక రాశి
శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశివారికి ఇంట్లో శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా వీరు దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో పనులు చేసేవారికి ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా చాలా అద్భుతాలు జరుగుతాయి. నిలిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశివారికి శుక్రుడి ఎఫెక్ట్ వల్ల వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి అన్ని లాభసాటిగా ఉంటాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









