Venus Transit: డిసెంబర్ 20 శుక్రుడి సంచారం.. ఈ రాశులవారికి బంఫర్‌ ఊహించని డబ్బు!

Venus Transit Effect On Zodiac: డిసెంబర్ 20వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులు వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 12, 2025, 11:31 AM IST
Venus Transit: డిసెంబర్ 20 శుక్రుడి సంచారం.. ఈ రాశులవారికి బంఫర్‌ ఊహించని డబ్బు!

Venus Transit Effect On Zodiac: డిసెంబర్ 20వ తేదీ చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు శుక్రుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి వెళ్లబోతున్నారు. ఈ గ్రహాన్ని ప్రేమ సంపద కీర్తి శ్రేయస్సు ఆనందానికి సూచికగా భావిస్తారు. శనివారం ఏడు గంటలకు శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన చాలా శుభప్రదం. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మూడు రాశుల్లో జన్మించిన వ్యక్తులకు శుభ ఫలితాలు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రేమతో పాటు సంపాదన కూడా విపరీతంగా పెరిగి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, శుక్రుడి ప్రభావంతో అద్భుతమైన లాభాలు పొందబోయే రాశులేవో? ఈ సమయంలో ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

తుల రాశి:
ధనస్సు రాశిలో శుక్రుడు సంచారం చేయడం కారణంగా తులా రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కుటుంబంలో శాంతి విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతోపాటు ఆదాయ మార్గాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా లాగ సాటిగా మారుతుంది. ప్రేమ జీవితంలో వస్తున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దీంతోపాటు ఈ సమయంలో అనుకున్న కోరికలు నెరవేర్చుకుని.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. 

వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమ సంబందాలు మెరుగుపడి విశేషమైన లాభాలు కలుగుతాయి. దీంతోపాటు శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు వీరి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం కూడా ప్రారంభమౌతాయి. ఇక ఆర్థిక సమస్యల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం కూడా దొరుకుతుంది. దీంతోపాటు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఊహించని ధన లాభాలను అందిస్తుంది.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా వీరికి ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఈ సమయంలో కెరీర్ పరంగా కూడా గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఈ సమయంలో తప్పకుండా వీరు శుభవార్తలు వింటారు. అలాగే ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి. అలాగే ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సమయంలో కాస్త ఉపశమనం పొందే వార్తను కూడా వింటారు. ఇక మానసికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన ప్రశాంతతను అందిస్తుంది.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచనలనుంచి సేకరించింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News