)
Venus In Leo Effect Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని భౌతిక సుఖంతో పాటు ప్రేమ ఆనందం వివాహం విలాసవంతం వైభవం కలకు సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహసంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా అన్ని రాశులు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఎన్నడ పొందలేని లాభాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా శుక్రుడు వివాహం లాంటి శుభకార్యాలలో కీలకపాత్ర పోషిస్తూ ఉంటాడు. అందుకే చాలామంది వివాహాలు శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉన్న సమయంలో జరుపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్యా రాశితో పాటు సింహా, ధనస్సు, కర్కాటక రాశిలో ఉంటే చాలా శుభప్రదమని భావిస్తారు. ఈ గ్రహం సొంత రాశి తులా రాశి.. అలాగే మిథున రాశిని కూడా సొంత రాశిగా భావిస్తారు. కాబట్టి ఈ రాశిలో ఉండడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 15వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి సంచరిస్తాడు. దీని కారణంగా ఈ క్రింది రాశులు ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి
ముఖ్యంగా ఈ సమయంలో మిథున రాశి వారు విశేషమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు. వీరికి కుటుంబ సభ్యులు, పిల్లలనుంచి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే భారీ మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే.. వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా సరదాగా గడపగలుగుతారు. గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో భారీ మొత్తంలో ప్రయోజనాలను అందిస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి శుక్రుడు ఈ సమయంలో మొదటి స్థానంలోకి రాబోతున్నాడు. దీని కారణంగా వీరికి విపరీతమైన సౌకర్యాలు పెరుగుతాయి. అంతేకాకుండా వివాహవంతమైన జీవితాన్ని కూడా అనుభవించే అవకాశాలున్నాయి. అలాగే ఆదాయం పెరిగి ఖర్చులు సమతుల్యంగా కొనసాగుతాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. లాభాలు పరిమితంగా వస్తాయి అంతేకాకుండా తలనొప్పి రక్తపోటు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోయి మానసికంగా చాలావరకు లాభాలు పొందుతారు.
తులారాశి
తులారాశి వారికి శుక్రుడు 11వ స్థానంలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల వీరికి జీవితం చాలా శుభప్రదంగా మారుతుంది. అలాగే వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారం లాభసాటిగా మారుతుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా పూర్తిగా నెరవేరే అవకాశాలున్నాయి. పోటీ వ్యాపారాల్లో వీరు విజయాలు సాధించుతారు. ఆరోగ్యం కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగు పడుతుంది. అలాగే కెరీర్ పరంగా వీరు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి