)
Happy Ugadi Wishes Hd Photos: ఉగాది పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం.. ఇప్పటికీ ప్రతి గ్రామంలో ఉండే దేవాలయాల్లో పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉగాది పండుగ రోజున క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. గ్రామస్తులంతా పండగ రోజున గుళ్లో చెప్పే పంచాంగాన్ని తప్పకుండా వింటారు. అంతేకాకుండా ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్య శాస్త్ర పండితులకు చెబుతూ ఉంటారు. ఇలా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పంచాంగ శ్రవణం ఇలాగే సాగుతూ వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలను తెలియజేయండి.
ఉగాది పండగ వచ్చేసింది..అందరిలో కొత్త ఆశలు చిగురించాయి..పంచాంగం తెలిసి భవిష్యత్తులోకి తొంగి చూద్దాం.. విజయాలన్నీ మన అవుతాయి..
"ఉగాది పండగ శుభాకాంక్షలు"
పంచాంగం కేవలం కాలగమనమే కాదు అది మన సాంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వం.. ఉగాది పండగ రోజే గౌరవించకుండా ఎల్లప్పుడూ పంచాంగాన్ని గౌరవిస్తూ ఉందాం..
ఉగాది రోజు సూచించే పంచాంగ శ్రవణం ఒక గొప్ప దిక్సూచి.. ఇది మన భవిష్యత్తుకు సరైన మార్గాన్ని చూపే దారి.. కాబట్టి పంచాంగాన్ని ఎల్లప్పుడూ గౌరవిద్దాం..
జీవితమనేది ఒక పెద్ద చక్రం లాంటిది.. ఈ చక్రాన్ని ఉగాది పంచాంగం గుర్తుచేస్తుంది.. మంచి చెడులను సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్దాం..
ఉగాది పంచాంగం ఒక ప్రత్యేకతను కూడి ఉంటుంది ఇది మనకు సమయాన్ని విలువైనదిగా గుర్తు చేస్తుంది.. ఈ సమయాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేసుకుంటూ.. ముందుకెళ్దాం..
కొత్త ఆరంభానికి ఉగాది పండుగ ఒక సూచనలాంటి.. పంచాంగం లోని శుభ ముహూర్తాలు మన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు అందిస్తాయి..
పంచాంగం ప్రకారం జీవితాన్ని ముందుకు సాగించడం అంటే క్రమశిక్షణతో ఉండడం అని అర్థం.. ఉగాది పంచాంగం ప్రతిరోజు మనకు క్రమశిక్షణను నేర్పుతుంది..
ఉగాది పంచాంగం మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు మార్గదర్శకం చేస్తుంది.. కాబట్టి ప్రకృతి అందించిన నియమాలను పాటిస్తూ.. జీవితాన్ని ముందుకు సాగించడం మంచిది.
ఉగాది పండగ పంచాంగం మన జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది.. ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. ముందుకు సాగుదాం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook