Traditional Pancha Kattu: పూజా చేసే సమయంలో గోచీ కట్టుకోవాలా.. మన ధర్మ శాస్త్రం ఏం చెబుతుంది..
Traditional Pancha Kattu: సాధారణంగా పూజా చేయాలంటే గోచీ పెట్టుకోవాలి. కానీ కొంత మంది సాధారణంగా లుంగీలా ధరించి పూజలు చేస్తారు. ఎలా చేస్తే పూజా ఫలం దక్కుతుంది. మన ధర్మ శాస్త్ర గ్రంథాలైన దర్మ సింధు, నిర్ణయ సింధు ఏం చెబుతుంది.
Traditional Pancha Kattu: వేదం అంటే అపౌరుషాలు. అంటే ఎవరు రచించనవి అని అర్ధం. ఇవి వాక్కు ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించినవి. అందులో ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ అని ఉంది. అంటే గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే చుట్టి కట్టినవాడు దిగంబరుడే అవుతాడనేది శాస్త్ర ప్రవచనం. కట్టుకునే బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదనే అర్ధం. అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు. ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి.
ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్య ఉన్నవాడని అర్దం. అన్ని పూజలకు అర్హుడు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య స్వర్గస్తురాలైందని అని గుర్తుగా భావిస్తారు. యజ్ఞయాగాలు, ఇతరత్రా క్రతువులకు పనికి రాడే అర్దం శాస్త్రంలో ఉంది. .
అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదా అంటే అవుననే అంటున్నాయి ధర్మ శాస్త్రాలు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు. కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. పూజా సమయంల గోచితోపాటు ఉత్తరీయం ధరించి మంగళ ప్రదడని అర్ధం. అందుకే పూజ చేసేవాడు మంగళ ప్రదుడై ఉత్తరీయంతో ఉండాలి.ఉత్తరీయం, గోచీ లేకుండా పూజా చేసేవాడు నగ్నంగా పూజా చేసినట్టు ధర్మ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
మాములుగా లుంగీలా కట్టుకుంటే అది పూజకు అనర్హుడు అని అర్ధం. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు శాస్త్ర ప్రవచనం తెలిసిన వారు. దేవాలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించరు. పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలనేది శాస్త్రం.
ఎవరికైనా బట్టలు పెట్టాలంటే పెట్టేవాడు ఉత్తరీయం తప్పనిసరిగా ధరించాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్ట కూడదు.
ఉత్తరీయం లేకుండా బట్టలు తీసుకోకూడదు. అంచు ఉన్న బట్టలు మాత్రమే పెట్టాలి. పూజ కార్యక్రమాలు చేసేటపుడు లాల్చీ, బనియను కూడా పనికిరావు. ఉత్తరీయంతో గోచీతో పూజా చేయాలనేది శాస్త్ర వచనం. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి మీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్ర ధారణలో గోచీ పెట్టుకుని ఉత్తరీయంతోనే పూజా చేయాలనేది శాస్త్ర ప్రవచనం.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.