Zodiac Signs As Aspects Of Lakshmi: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశిచక్రానికి దాని కంటూ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. అందులో కొన్ని రాశులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే జ్యోతిష్యంలో వృషభ రాశి (Taurus), తులారాశి (Libra)లను లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రాశులగా చెబుతారు. ఈ రెండు రాశులలో జన్మించిన వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుందని నమ్ముతారు.Zodiac Signs as Aspects of Lakshmi
వృషభ రాశివారి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుంది: 12 రాశులలో వృషభ రాశి ఒకటి. ఈ రాశి అధిపతి శుక్ర గ్రహం. శుక్రుడు ఆనందానికి, సంపదకు, సౌందర్యానికి గుర్తు. వృషభ రాశి వారు ఎంతో ఓర్పు కలిగి ఉంటారు. ఏదైనా సాధించే పట్టుదల వీరిలో ఉంటుంది. వీరు వారి లక్ష్యాల పట్ల అంకితభావంతో ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎలాంటి డబ్బు సంబంధిత సమస్యలు ఉండవు. వీరు డబ్బుకు ఎంతో విలువ ఇస్తారు. అనవసరమైన ఖర్చులు చేయడానికి ఇష్టపడరు.
శుక్రుని ప్రభావం వల్ల వృషభ రాశి వారు కళ, సంగీతంలో ప్రవీణులై ఉంటారు. లక్ష్మీదేవి వల్ల వీరు ఎల్లప్పుడు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. వృషభ రాశివారు మంచి స్నేహితులుగా ఉంటారు. ఇతరులకు సహాయం చేసే మనస్సు ఉంటుంది. దీని వల్ల వీరిని అందురూ ఇష్టపడుతారు. వీరు అధికంగా శ్రమించి పని చేస్తారు కాబట్టి లక్ష్మీదేవి కూడా కష్టపడి పనిచేసే వారిని అనుగ్రహిస్తుంది.
తులారాశి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుంది: తులారాశికి కూడా శుక్ర గ్రహమే అధిపతి. వీరు పుట్టుకతోనే దైర్యవంతలు, సామరస్యం కలిగిన వారు. వీరితో ప్రతిఒక్కరు ఎంతో ప్రేమగా, గౌర్వంగా ఉంటారు. తులారాశి వారు ఏలాంటి విషయాన్ని అయిన సులువుగా పరిష్కరిస్తారు. దీని కారణంగా మీరు జీవితంలో విజయాన్ని పొందుతారు. ఈ రాశివారు సామాజిక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇతరులతో సులభంగా కలిసిపోతారు.
లక్ష్మీదేవి అనుగ్రహాంతో వీరు తెలివైన పెట్టుబడులు పెడతారు. వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది.
చివరగా ఏ రాశిలో పుట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ తమ సానుకూల లక్షణాలను పెంపొందించుకోవడం కోసం కష్టపడి పనిచేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు. దైవ బలంతో పాటు బుద్ధి బలం ఉండటం చాలా ముఖ్యం. ఈ రాశుల వారు మాత్రమే కాకుండా ఇతర రాశుల వారు కూడాలక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతార
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









