Yadbhavam Thadbhavathi: 'యద్భావం తద్భవతి' అంటే అర్థం ఏమిటి? పురాణ గాథలు ఇవే!

Yadbhavam Thadbhavathi Story: పురాణ ఇతిహాసాలతో పాటు మనం తరచూ ఉపయోగించే పదం 'యద్భావం తద్భవతి '. ఈ పదం అర్థం.‌. ఈ పదం వెనుక కథలు ఏమున్నాయో తెలుసుకుందాం..

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 23, 2025, 03:12 PM IST
Yadbhavam Thadbhavathi: 'యద్భావం తద్భవతి' అంటే అర్థం ఏమిటి? పురాణ గాథలు ఇవే!

Yadbhavam Thadbhavathi: వాడుక భాషలో కొన్ని పురాతన గాథలకు సంబంధించి కొన్ని సామెతలు, నానుడిలు వినియోగిస్తుంటాం. కొన్ని సార్లు వాటి అర్థం తెలియకపోయినా సందర్భం వచ్చినప్పుడు వాడేస్తుంటాం. అయితే ఆ పదాల అర్థం తెలుసుకుంటే ఆ సామెతలు, నానుడిని మరింత సందర్భోచితంగా వాడవచ్చు. వాటి అర్థం ఇతరులకు వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే మనం తరచూ వినియోగించే యద్భావం తద్భవతి అంటే ఏమిటో తెలుసుకుందాం. పురాణ గాథల్లో ఈ నానుడికి సంబంధించి విశిష్టత ఏమిటో తెలుసా?

Add Zee News as a Preferred Source

సమాజం లేదా సృష్టి మంచి చెడుల కలయికతోనే ఉంది. మహాభారతంలో ధర్మరాజు ఈ లోకమంతా ధర్మంగా నడుస్తున్నట్టుగా భావిస్తుండగా.. దుర్యోధనుడి దృష్టిలో మొత్తం అధర్మంగానే ఉంటుంది. తప్పు చేసినవాళ్లకి కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ధర్మం జరగదు అని ధర్మరాజు పించేది భావన. ఇద్దరు చూసేది ఒక లోకాన్నే కానీ వారికి కలిగే భావనలు పరస్పరం విభిన్నంగా ఉన్నాయి. మనం ఎలా చూస్తామో అది అలానే కనిపిస్తుంది అనే దానికి ఉదాహరణ. ఆ సందర్భంలోనే యద్భావం తద్భవతి అనేది వచ్చింది.

సంస్కృతంలో యద్భావం తద్భవతి అనే వ్యాక్యం ఉంది. మనం ఎలా చూస్తే అలాగే ఉంటుందనేది ఈ వ్యాక్యం అర్థం. దీనికితోడు 'యత్ వాసనా తత్ దర్శనం' అనేది కూడా ఒకటి ఉంది. అవుతుంది. అంటే వాసన ప్రకారమే మనకు ఆ సందర్భం, ఆ భావన దర్శనం అవుతుంది. వాసన మనం నిర్ణయించిన మన భావాన్ని ఆధారంగా ఉంటుంది.

ఈ ప్రపంచం చెడిపోయింది.. సమాజం బాగా లేదు. పనికి రానిదయిందని దీనిని ఎవరూ రక్షించలేరు. ఎవరో వచ్చి మారుస్తారనే భావంతో ఉంటే అది వాసనై పునర్జన్మలో మళ్లీ అదే భావంతో పుడతామని పురాణ గాథలు చెబుతున్నాయి. సమాజం మంచి చెడుల కలయికతోనే ఉంది. ధర్మరాజు, దుర్యోధనుడికి సమాజం రెండు భిన్న విధిగా కనిపించినట్టే మనకు సమాజం.. మన చుట్టుపక్కల వాళ్లు మన అభిప్రాయానికి అనుకున్నట్టుగా కనిపిస్తాయి. ఆ సమయంలోనే యద్భావం తద్భవతి అని అంటారు.

మరో గాథ
కొందరు ఆవును చూస్తారు. సాధారణంగా అది ఒక జంతువు. కానీ కొందరు భక్తిభావంతో గోమాతగా చూస్తారు . శువనే భావంతోనే ఉన్నాడు. పాల వ్యాపారం చేసేవాడు దానిని వ్యాపార వస్తువుగా చూస్తాడు. ఇది ఎన్ని పాలిస్తుంది? దీనిని అమ్ముతారా? కొంటే మనకెంత లాభం? అని ఆలోచించాడు. కొంచెం దైవభక్తి ఉన్నవాడు చూసాడు. తోకవైపు తిరిగి దణ్ణం పెట్టి వెళ్లిపోతాడు. మరొకతను ఆ ఆవుని పూజ చేసి అరటిపండు పెడతా. ఆవు మాంసాన్ని అమ్ముకునే ఒకతను దానిని బలి పశువుగా చూస్తాడు. ఒక చర్మకారుడు దానిని చూసి దాని చర్మంతో మంచి చెప్పుల జతలు కుట్టవచ్చని భావిస్తాడు. ఇది కూడా యద్భావం తద్భవతి అనే దానికి ఒక ఉదాహరణ.

మరో ఉదాహరణ 
ఒక స్త్రీని చూస్తే ఒక్కొక్కరికి ఒక్కో భావన కలుగుతుంది. కొందరికి ఒక స్త్రీని చూస్తే తల్లి అనే భావం కలగవచ్చు. మరికొందరికి సోదరి అనే భావం కలగవచ్చు. మనం ఎలా చూస్తామో స్త్రీ అలా కనిపిస్తుంది. మనం మన భావనను బట్టి మంచి చెడు నిర్ణయిస్తుంటాం. ఒక్కో సమయంలో మన నిర్ణయం సరైనది కావచ్చు.. లేదా తప్పు కావొచ్చు. పాండురంగ భక్తుడు భక్త తుకారాం ఒక వేశ్యను తల్లిగా కొలిచాడు. ఆమెను ధనవంతులు పొందుకోరేవారు.. కానీ తుకారాం మాత్రం ఆమెను తల్లి భావంతో చూశాడు. తుకారాం వలన ఆమెలో పరివర్తన కలిగి అప్పటి నుంచి ఆమె భక్తి మార్గంలోకి వెళ్లారు. కనుక ఏ విషయాన్నైనా చూచే చూపు.. కలిగే భావనను బట్టి ఉంటుంది . 'అంతటా మంచి చూచేవాడు మంచివాడై ఉంటాడు. అంతటా చెడు చూచేవాడు చెడ్డవాడై ఉంటాడు' అని నిర్వచనం వచ్చింది . దీని మాదిరే యద్భావం తద్భవతి అనే పదం వచ్చింది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News