Ayodhya Surya Tilak అయోధ్య రాముడికి 'సూర్య తిలకం' ఎప్పుడు? ఎలా చూడాలి?

When Surya Tilak In Ayodhya Ram Mandir Here Full Schedule: శ్రీరామ నవమిని పురస్కరించుకుని బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. అత్యంత అరుదైన ఘట్టం ఆవిష్కారానికి ముహూర్తం నిర్ణయించారు. సూర్య తిలకం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 27, 2025, 03:20 PM IST
Ayodhya Surya Tilak అయోధ్య రాముడికి 'సూర్య తిలకం' ఎప్పుడు? ఎలా చూడాలి?

Surya Tilak In Ayodhya: శ్రీరామ నవమి వేడుకలకు రామాలయాలు, ఆంజనేయ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా రామ నామం మార్మోగనుంది. నవమి వేడుకలు అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని రామ జన్మభూమి అయిన అయోధ్యలో ప్రత్యేక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. సూర్యుడి కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడనున్నాయి. సూర్య తిలకం ఎప్పుడు? ఎక్కడ తిలకించాలో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Yadbhavam Thadbhavathi: 'యద్భావం తద్భవతి' అంటే అర్థం ఏమిటి? పురాణ గాథలు ఇవే!

శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 6వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు జరగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు ట్రస్ట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Also Read: Shukra Gochar: శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాటరీ తగిలినట్టే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది..

శ్రీరామ నవమి వేడుకల రోజున ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45 గంటల మధ్య ఆరాధన కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 12 గంటలకు హారతి అనంతరం సూర్య తిలకం కార్యక్రమం ఉంటుంది. సూర్య భగవానుడి కిరణాలు బాలరాముడి నుదుటిపై తిలకం మాదిరి కనిపించనున్నాయి. ఈ అద్భుత దృశ్యం వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఈ సూర్య తిలకం దాదాపు 20 సంవత్సరాల వరకు ప్రతి శ్రీరామనవమి రోజున ఆవిష్కృతమయ్యేలా ఆలయ నిర్మాణ సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖరం నుంచి సూర్య కిరణాలు గర్భాలయంలో కొలువుదీరిన బాల రాముడి నుదుటిన పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా అద్దాలు, లెన్సులు అమర్చనున్నారు. రూర్కీ నుంచి శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే అయోధ్యకు చేరుకుంది. సూర్య తిలకం కోసం పరికరాలను అమర్చే పనిని ప్రారంభించింది. 

ప్రత్యేక మెకానిజం
సీబీఆర్‌ఐ (సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌) రూర్కీకి చెందిన శాస్త్రవేత్తల బృందం శ్రీరాముడి విగ్రహం నుదుటిపై 75 మిల్లీమీటర్ల వృత్తాకారంలో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పడేలా విధంగా సూర్య తిలక్ మెకానిజమ్‌ను రూపొందించారు. గేర్ ఆధారిత సూర్య తిలక్ మెకానిజం ఆధారంగా సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News